
ఆరేళ్ల మగధీరుడు..
చల్‌చల్ గుర్రం చలాకి గుర్రం అంటూ ఆడుకోవాల్సిన వయసులో ఈ బుడతడు అసలుసిసలైన గుర్రాన్ని దౌడు తీయిస్తున్నాడు.
హైదరాబాద్: చల్‌చల్ గుర్రం చలాకి గుర్రం అంటూ ఆడుకోవాల్సిన వయసులో ఈ బుడతడు అసలుసిసలైన గుర్రాన్ని దౌడు తీయిస్తున్నాడు. చిన్న వయసులోనే గుర్రపు స్వారీ నేర్చుకుని స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. కుత్బుల్లాపూర్ పరిధిలోని కొంపల్లికి చెందిన లక్ష్మయ్య కుమారుడు అనంత్ నాగ్ ఆరేళ్ల వయసులోనే గుర్రపు స్వారీలో ఆరితేరాడు.
స్థానిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న అనంత్ నాగ్‌కు చిన్నప్పటి నుంచి గుర్రాలు అంటే అమితమైన ఇష్టం.. దాన్ని గుర్తించిన తండ్రి వేసవి సెలవుల్లో గుర్రపు స్వారీలో శిక్షణ ఇప్పించారు. దీంతో ఇలా గుర్రంపై దౌడుతీస్తూ.. తెగ ఎంజాయ్ చేస్తూ, చుట్టుపక్కల వారిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు ఈ చిచ్చర పిడుగు.