
సాక్షి, ముంబై: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు పలువురు స్వచ్ఛందంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ముంబైలోని ప్రముఖ శ్రీసిద్ధి వినాయక ఆలయ ట్రస్ట్ సైనికుల సహాయ నిధికి భారీ విరాళాన్ని ప్రకటించింది. బాధిత కుటుంబాల సహాయార్థం రూ. 51 లక్షల విరాళాన్ని ప్రకటించింది. మరోవైపు పుల్వామాలో ముష్కరులు జరిపిన ఆత్మాహుతి దాడిలో అమరులైన సీఆర్‌పీఎఫ్ జవానుల సంఖ్య 49కి చేరింది.
కాగా దేశంకోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలకు అండగా నిలిచే విషయంలో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అందరికంటే ముందుగా తన వంతు సాయాన్ని అందించి పెద్ద మనసు చాటుకున్నారు. ఈమేరకు తన ట్విట్టర్‌లో ఆర్థిక సాయం అందించిన సర్టిఫికెట్‌ను షేర్ చేస్తూ.. సైనికుల కుటుంబాలకి అండగా నిలవాల్సిన సమయం వచ్చింది. మనవంతు సహాకారం అందిద్దాం.. ఎంతో కొంత సాయం చేసి మనమంతా వారికి మన మద్దతును అందించాలంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment