కశ్మీర్‌లో తీవ్రవాదుల దాడిలో మరణించిన ఇద్దరు తమిళ జవానుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో తిరుచ్చి విమానాశ్రయానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి ఉగ్రదాడిలో చనిపోయిన శివచంద్రన్ స్వగ్రామం కారైకుడికి, మరో జవాను స్వగ్రామం తూత్తుకుడికి ప్రత్యేక మిలటరీ వాహనాల్లో తరలించారు. ముందుగా తిరుచ్చి విమానాశ్రయం చేరుకున్న జవానుల మృతదేహాలకు కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర మంత్రులు, అధికారులు ఘననివాళులు అర్పించారు.