పుల్వామా ఉగ్రదాడి నిందితుడు గుండెపోటుతో మృతి | 2019 Pulwama Terror Attack Accused Bilal Ahmad Kuchey Has Died From A Heart Attack | Sakshi
Sakshi News home page

పుల్వామా ఉగ్రదాడి నిందితుడు గుండెపోటుతో మృతి

Published Tue, Sep 24 2024 12:34 PM | Last Updated on Tue, Sep 24 2024 1:30 PM

Pulwama Accused Suffers Heart Attack Dies

జమ్మూ: 2019 పుల్వామా ఉగ్రదాడి నిందితుడు జమ్ముకశ్మీర్‌లోని జమ్మూ ఆసుపత్రిలో గుండెపోటుతో మృతిచెందాడు. ఇతని వయస్సు 32 ఏళ్లు. ఈ సమాచారాన్ని ఓ అధికారి మీడియాకు తెలిపారు.

 

 2019లో జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శ్రీనగర్-జమ్ము హైవేపై లెత్‌పోరా సమీపంలో ఉగ్రవాదులు సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఐఈడీతో పేలుడుకు పాల్పడ్డారు. ఈ దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందగా, పలువురు గాయపడ్డారు. వీరంతా సీఆర్‌పీఎఫ్‌లోని 54 బెటాలియన్‌కు చెందినవారు. పేలుడు ధాటికి బస్సు ధ్వంసమైంది. ఈ ఆర్మీ కాన్వాయ్ జమ్ము నుంచి శ్రీనగర్‌కు వెళుతుండగా ఆ ఘటన చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: శ్రీనగర్‌ లాల్‌చౌక్‌ కోసం మామ- మేనల్లుడు పోటీ

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement