శ్రీనగర్: ఉద్రవాదుల తూటాల శబ్దాలతో సోమవారం తెల్లవారుజామూన కశ్మీర్ దద్దరిల్లింది. జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లా లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య తెల్లవారుజామున భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారు. లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో సీఆర్పీఎఫ్ జవాన్లు, కశ్మీర్ సాయుధ పోలీసులు విస్రృతంగా తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలోనే జవాన్లపైకి ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ముష్కరుల దాడిని తిప్పికొట్టిన భద్రతా దళాలు.. ఎదురు కాల్పులు జరిపి నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కాల్పుల్లో ముగ్గురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలిలో రెండు ఏకే రైఫిల్స్, ఒక ఎస్‌ఎల్‌ఆర్, ఒక తుపాకీని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment