జమ్మూకశ్మీర్ లో తీవ్రవాదులు మళ్లీ చెలరేగారు. పుల్వామా జిల్లాలో ఆదివారం సీఐఎస్ఎఫ్ క్యాంపుపై గ్రెనేడ్ తో దాడికి పాల్పడ్డారు.
పుల్వామా: జమ్మూకశ్మీర్ లో తీవ్రవాదులు మళ్లీ చెలరేగారు. పుల్వామా జిల్లాలో ఆదివారం సీఐఎస్ఎఫ్ క్యాంపుపై గ్రెనేడ్ తో దాడికి పాల్పడ్డారు. నూర్పోరా త్రాల్ ప్రాంతంలో పోలింగ్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేశారు. ఈ ఘటనలో జవాన్ గాయపడ్డాడు. అతడిని శ్రీనగర్ ఆస్పత్రికి తరలించారు.
సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ శ్రీనగర్ లో పర్యటించనున్న నేపథ్యంలో తీవ్రవాదులు దాడికి పాల్పడడం కలకలం రేపుతోంది. ఈనెల 9న జమ్మూకాశ్మీర్ లో 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.