జవాన్ల కుటుంబాలకు బీసీసీఐ రూ.5 కోట్ల సాయం? | BCCI Acting President CK Khanna Proposes Rs 5 Crore Donation To Families Of Soldiers Killed | Sakshi
Sakshi News home page

జవాన్ల కుటుంబాలకు బీసీసీఐ రూ.5 కోట్ల సాయం?

Published Sun, Feb 17 2019 4:57 PM | Last Updated on Sun, Feb 17 2019 4:57 PM

BCCI Acting President CK Khanna Proposes Rs 5 Crore Donation To Families Of Soldiers Killed - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు రూ.5 కోట్లు కేటాయించాలని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షులు సీకే ఖన్నా ఆదివారం ప్రతిపాదించారు. అలాగే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ, ఇండియా-ఆసీస్‌ మధ్య జరగబోయే టీ20 సిరీస్‌, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2019 మ్యాచ్‌ల ముందు 2 నిమిషాల పాటు మౌనం పాటించాలని ప్రతిపాదించారు.

పుల్వామా దాడిలో చనిపోయిన అమర జవాన్ల కుటుంబాలకు తమకు తోచినంత సహాయం చేయాలని అన్ని రాష్ట్రాల క్రికెట్‌ అసోసియేషన్‌లకు, ఐపీఎల్‌ ప్రాంఛైజీలకు ఖన్నా విజ్ఞప్తి చేశారు. గురువారం శ్రీనగర్‌- జమ్మూ జాతీయ రహదారిపై సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌ వెళ్తుండగా ఉగ్రవాది కారుతో ఢీకొట్టి ఆత్మాహుతికి పాల్పడటతో 40 మంది జవాన్లు మృతిచెందారు. పదుల సంఖ్యలో జవాన్లు గాయపడ్డారు. 2500 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు 78 బస్సుల్లో శ్రీనగర్‌ బయలుదేరుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement