శ్రీనగర్ : జమ్మూలో ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించారు. పూల్వామా జిల్లాలో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు కశ్మీరీ పౌరులు మృతిచెందారు. మరికొంత మందికి తూటాలు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఉదయం భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయిన విషయం తెలిసిందే. ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా అమాయక పౌరులపై ఉగ్రవాదులు తూటాల వర్షం కురిపించారు. దీంతో పూల్వామా లో ప్రాంతంలో పరిస్థితి హింసాత్మకంగా మారటంతో భారీగా బలగాలను మోహరించి, ఇంటర్నెట్ సర్వీస్‌ను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ముగ్గురు ఉగ్రవాదుల హతం..
అంతకుముందు జమ్మూ కశ్మీర్ జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా భద్రతా బలగాలు వారి దాడులను తిప్పికొట్టాయి. జమ్మూ పోలీసులు, కేంద్ర రిజర్వు పోలీస్ బలగాలు (సీఆర్‌పీఎఫ్) ఉమ్మడిగా జరిపిన ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా, ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
కాగా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఉగ్రవాది జహోర్ అహ్మద్ ఠాకూర్ గతంలో ఇండియన్ ఆర్మీలో జవాన్‌గా సేవలందించాడు. ఈ ఏడాది జూలైలో ఏకే-47 ఆయుధంతో ఆర్మీ క్యాంపు నుంచి పరారైన అహ్మద్ హిజ్బుల్ ముజాహిద్దీన్‌లో చేరినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment