ఎన్‌కౌంటర్‌ : ముగ్గురు ఉగ్రవాదులు హతం | Jaishe Terrorists Killed In Pulwama Encounter | Sakshi
Sakshi News home page

పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్‌

Published Wed, Jun 3 2020 11:34 AM | Last Updated on Wed, Jun 3 2020 11:34 AM

Jaishe Terrorists Killed In Pulwama Encounter - Sakshi

శ్రీనగర్‌ : జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా కంగన్‌ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైషే మహ్మద్‌ ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. జైషే ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు కంగన్‌ ప్రాంతంలో గాలింపు చేపట్టిన క్రమంలో ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. మరణించిన ఉగ్రవాదులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరణించిన జైషే ఉగ్రవాదుల్లో ఓ మిలిటెంట్‌ కమాండర్‌ ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో పుల్వామాలో ముందుజాగ్రత్త చర్యగా ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేశారు.

చదవండి : ‘పుల్వామా’ నిందితుడి అరెస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement