పుల్వామా ఘటన.. విజయ్‌ ఆర్థిక సాయం | Vijay Devarakonda Donation To Pulwama Soldiers | Sakshi
Sakshi News home page

పుల్వామా ఘటన.. విజయ్‌ ఆర్థిక సాయం

Published Sat, Feb 16 2019 9:10 AM | Last Updated on Sat, Feb 16 2019 3:23 PM

Vijay Devarakonda Donation To Pulwama Soldiers - Sakshi

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు చెలరేగుతుండగా.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ట్వీట్లతో ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. కానీ విజయ్‌ దేవరకొండ మాత్రం ఒక అడుగు ముందుకేశాడు. వారి కుటుంబాలను ఆదుకోవడం కోసం తన వంతు సాయాన్ని చేసి.. అందర్నీ సాయం చేయమని అడిగాడు. 

తను ఎంత మొత్తాన్ని సాయం చేశాడన్నది తెలియకుండా చేసి.. దానికి సంబంధించిన సర్టిఫికేట్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ‘‘వారు మన కుటుంబాల్ని రక్షిస్తున్నారు. మనం ఆ సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలి. మన సైనికుల జీవితాలను సాయంతో వెలకట్టలేము. కానీ మనం మనవంతు సహకారం అందించాలి. నావంతు సహకారం నేను అందించా. మనందరం కలిసి సాయం చేద్దాం. మనమంతా కలిసి వారికో పెద్ద సపోర్ట్‌ని క్రియేట్ చేద్దాం’’ అని ట్వీట్‌ చేశాడు . అందరి కంటే విజయ్‌ దేవరకొండ ప్రత్యేకమని ఇలాంటి సందర్బాల్లోనే వ్యక్తమవుతూ ఉంటుంది. మరి ఎంతమంది స్పందించి తమ వంతు సాయాన్ని అందిస్తారో చూడాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement