
శ్రీనగర్ : సరిహద్దులో మరోసారి ఉగ్రవాదులు చెలరేగిపోయారు. పుల్వామా జిల్లాలోని సంబూర గ్రామంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. ఘటనలో ఓ ఉగ్రవాది కూడా హతం అయ్యాడు.
ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నారని పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు గురువారం సాయంత్రం గ్రామానికి చేరుకున్న భద్రతా దళాలు వారి కోసం గాలించాయి. వారిని గమనించిన ముష్కరలు కాల్పులు మొదలుపెట్టాయి. దీంతో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఎదురు దాడి ప్రారంభించిన సైనికులు ఓ ఉగ్రవాదిని కాల్చి చంపాయి.
చికిత్స పొందుతూ జవాన్లు ప్రాణాలు విడిచినట్లు అధికారులు వెల్లడించారు. చనిపోయిన ఉగ్రవాదిని జైషే మహ‍్మద్ ఉగ్ర సంస్థకు చెందిన బాబర్‌గా గుర్తించారు. చీకట్లో మరో ఇద్దరు ఉగ్రవాదులు పరారైనట్లు భావించిన పోలీసులు.. వారి కోసం తనీఖీలు చేపట్టారు. చివరకు వారు దొరక్కపోవటంతో నేటి ఉదయం ఆపరేషన్ ముగిసినట్లు ప్రకటించారు.