jawans martyred
-
దటీజ్ సీఎం యోగి.. అమర జవాన్ల కుటుంబాలకు భారీ సాయం!
ఈశాన్య రాష్ట్రం సిక్కింలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా, జవాన్లతో వెళ్తున్న ఆర్మీ ట్రక్కు ఓ మూల మలుపు వద్ద అదుపు తప్పి లోయలోపడింది. ఈ ప్రమాదంలో 16 మంది జవాన్లు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంలో పలువురు జవాన్లు గాయపడ్డారు. అయితే, రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో యూపీకి చెందిన నలుగురు జవాన్లు ఉన్నారు. దీంతో, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చనిపోయిన జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచారు. కాగా, ప్రమాదంలో చనిపోయిన నలుగురు జవాన్ల కుటుంబాటకు ఒక్కొక్కరికి రూ.50 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాట్టు సీఎం యోగి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే, నలుగురు జవాన్ల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు యూపీ సీఎంవో నుంచి లేఖను విడుదల చేశారు. దీంతో, సీఎం యోగి నిర్ణయంపై జవాన్ల కుటుంబాలతో పాటుగా యూపీ ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, సిక్కింలో జరిగిన ప్రమాదం మృతుల్లో ముగ్గురు ఆర్మీ అధికారులు, 13 మంది సైనికులు ఉన్నారని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. UP CM Yogi Adityanath has announced to provide financial assistance of Rs 50 lakhs each to the families of four Army soldiers of the state who lost their lives in a road accident in Sikkim yesterday. CM also announced to give a govt job to a family member of the soldiers: CMO pic.twitter.com/AXYnbCAfX8 — ANI UP/Uttarakhand (@ANINewsUP) December 24, 2022 -
ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్ల మృతి
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని నౌషెరాలో బుధవారం భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతిచెందారు. నౌషెరా సెక్టార్లో ఉగ్ర కదలికలపై సమాచారం అందటంతో భారత బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయని ఆర్మీ అధికారులు తెలిపారు. కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న క్రమంలో ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందినట్టు వెల్లడించారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పారు. మంగళవారం ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన మనోజ్ ముకుంద్ నరవాణే.. పొరుగుదేశం ఉగ్రవాదానికి ఊతం ఇవ్వడం మానని పక్షంలో ఆదేశంలో ఉగ్రమూలాలను దెబ్బతీసే హక్కు భారత్‌కు ఉందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
సంబూర ఎన్కౌంటర్.. ఇద్దరు జవాన్ల మృతి
శ్రీనగర్ : సరిహద్దులో మరోసారి ఉగ్రవాదులు చెలరేగిపోయారు. పుల్వామా జిల్లాలోని సంబూర గ్రామంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. ఘటనలో ఓ ఉగ్రవాది కూడా హతం అయ్యాడు. ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నారని పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు గురువారం సాయంత్రం గ్రామానికి చేరుకున్న భద్రతా దళాలు వారి కోసం గాలించాయి. వారిని గమనించిన ముష్కరలు కాల్పులు మొదలుపెట్టాయి. దీంతో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఎదురు దాడి ప్రారంభించిన సైనికులు ఓ ఉగ్రవాదిని కాల్చి చంపాయి. చికిత్స పొందుతూ జవాన్లు ప్రాణాలు విడిచినట్లు అధికారులు వెల్లడించారు. చనిపోయిన ఉగ్రవాదిని జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన బాబర్‌గా గుర్తించారు. చీకట్లో మరో ఇద్దరు ఉగ్రవాదులు పరారైనట్లు భావించిన పోలీసులు.. వారి కోసం తనీఖీలు చేపట్టారు. చివరకు వారు దొరక్కపోవటంతో నేటి ఉదయం ఆపరేషన్ ముగిసినట్లు ప్రకటించారు. -
కశ్మీర్లో సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి
-
ఉగ్రదాడిని ఖండించిన జాతీయ నేతలు
-
17 ఏళ్లలో 19 దాడులు
భారతదేశ కిరీటం జమ్మూ, కశ్మీర్లో 1999 నవంబర్ నుంచి ఇప్పటి వరకు, దాదాపు 17 సంవత్సరాల్లో భద్రతాదళాలపై మొత్తం 19 దాడులు జరిగాయి. దాదాపు 130 మందికి పైగా సిబ్బంది వీర మరణం పొందారు. దాడుల వివరాలు.. 1999 నవంబర్ 3: శ్రీనగర్‌లోని బదామీ బాగ్‌లో ఆర్మీ కార్యాలయంపై దాడి. 10 మంది ఆర్మీ సిబ్బంది మరణం. 2002 మే 14: జమ్మూలోని కాలూచక్లో ఉన్న ఆర్మీ కంటోన్మెంట్‌పై దాడి. 36 మంది మృతి. 48 మందికి గాయాలు. 2003 జూలై 22: అఖ్నూర్లో ముగ్గురు ఉగ్రవాదుల బృందం ఆర్మీ శిబిరంపై దాడి. 8 మంది భద్రతా దళ సిబ్బంది మృతి. 2005 ఏప్రిల్ 6: ఒక పర్యాటక రిసెప్షన్ కేంద్రంపై ఇద్దరు ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి. 2006 అక్టోబర్ 5: శ్రీనగర్ నడిబొడ్డున ఉగ్ర దాడి. ఐదుగురు పోలీసులు, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు, ఒక పౌరుడి మరణం. 2013 మార్చి 31: సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడి. ఐదు మంది జవాన్ల వీర మరణం. 2013 జూన్ 24: శ్రీనగర్‌లోని హైదర్‌పొరాలో మిలిటరీ వాహన శ్రేణిపై దాడి. 8 మంది జవాన్లు మృతి. 2013 సెప్టెంబర్ 26: కశ్మీర్‌లలో జంట ఆత్మాహుతి దాడులు. ముగ్గరు ఉగ్రవాదులతో పాటు 10 మంది మరణం. 2014 నవంబర్ 27: అర్నియా సెక్టార్‌లోని కఠార్ గ్రామంలో ఎన్కౌంటర్. ముగ్గురు ఆర్మీ సిబ్బంది, ముగ్గురు ఉగ్రవాదులు, నలుగురు పౌరులు సహా మొత్తం 10 మంది మృతి. 2014 డిసెంబర్ 5: యూరి సెక్టార్‌లోని ఆర్మీ 31వ ఫీల్డ్ రెజిమెంట్ ఆర్డినెన్స్ శిబిరంపై ఉగ్రవాదుల దాడి. ఆర్మీకి చెందిన ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఏడుగురు జవాన్లు, రాష్ట్ర పోలీసుల్లో ఒక ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల మృతి. ఆరుగురు ఉగ్రవాదులు కూడా. 2015 మార్చి 20: కఠువా జిల్లాలోని పోలీస్ స్టేషన్‌పై ముష్కరుల దాడి. ముగ్గురు భద్రతా దళాల సిబ్బంది, ఇద్దరు పౌరుల మృతి. 2015 మార్చి 21: సాంబ జిల్లాలోని జమ్మూ-పఠాన్‌కోట్ ఆర్మీ శిబిరంపై ఇద్దరు ఉగ్రదాడి. తిప్పికొట్టి హతమార్చిన భద్రతా దళాలు. 2015 మే 31: కుప్వారా జిల్లాలో బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంపై దాడికి ఆరుగురు ఉగ్రవాదుల యత్నం. తిప్పి కొట్టిన ఆర్మీ. నలుగురు ఉగ్రవాదులు హతం. 2015 నవంబర్ 18: కుప్వారా అడవుల్లో ఉగ్రవాదులతో ఎన్కౌంటర్. పారా కమాండోకు చెందిన కల్నల్ మృతి. 2015 నవంబర్ 25: కుప్వారా జిల్లా తంఘదర్లోని నియంత్రణ రేఖ వద్ద ఆర్మీ శిబిరంపై ఉగ్రవాదుల దాడి. ఒక జనరేటర్ ఆపరేటర్, ముగ్గురు ఉగ్రవాదులు హతం. 2015 డిసెంబర్ 7: అనంతనాగ్ జిల్లాలోని బిజ్బెహరా వద్ద సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు. ఆరుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు. 2016 ఫిబ్రవరి 21: శ్రీనగర్ దగ్గర్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో మొత్తం (సిబ్బంది, ఉగ్రవాదులు కలిపి) 7 మంది మృతి. 2016 జూన్ 25: శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై వెళ్తున్న సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై ఉగ్రదాడి. 8 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతి. 20 మందికి గాయాలు. 2016 సెప్టెంబర్ 18: యూరి సెక్టార్‌లోని ఆర్మీ 12వ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంపై దాడి. 17 మంది జవాన్లు మృతి. -
ఉగ్ర కారకులు తప్పించుకోలేరు: మోదీ
న్యూఢిల్లీ: యూరిలో ఉగ్ర దాడికి తెగబడ్డ వారిని శిక్షించి తీరుతామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉగ్ర కారకులు శిక్ష నుంచి తప్పించుకోలేరని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నట్లు చెప్పారు. దాడిని హేయమైన, పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు. దాడిలో అసువులు బాసిన సైనికులకు జోహార్లు పలికిన ప్రధాని.. అమర జవాన్ల సేవలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. కుయుక్తులను తిప్పికొడతాం: ప్రణబ్ న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని యూరి సైనిక క్యాంపుపై ఉగ్రదాడిని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఖండించారు. ఉగ్రవాదులు, వారికి అండగా నిలిచిన వారి కుయుక్తులను భారత్ తిప్పికొడుతుందని పరోక్షంగా దాయాది దేశం పాకిస్తాన్‌ను హెచ్చరించారు. ఇటువంటి దాడులకు భారత్ భయపడబోదని స్పష్టం చేశారు. దేశ సేవలో ప్రాణ త్యాగం చేసిన సైనికులకు ఘన నివాళులర్పించిన రాష్ట్రపతి...మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. -
ఉగ్రదాడిని ఖండించిన జాతీయ నేతలు
న్యూఢిల్లీ/శ్రీనగర్: యూరి సైనిక స్థావరంపై ఉగ్రదాడి ని పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. యూరి ఘటన జాతీయ సమైక్యత, చైతన్యంపై జరిగిన క్షమించరాని దాడి అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు. తాజాదాడి వెనుక సూత్రధారుల్ని చట్టంముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలన్నారు. ఉగ్రవాదుల దాడులను తిప్పికొట్టేలా భద్రతా బలగాలు తమ వ్యూహాలకు పదును పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. ఉగ్రవాదంపై భారత్ పోరు నిర్ణయాత్మక దశకు చేరిందని..సైనికుల త్యాగాలు వృథా కాకుండా మోదీ ప్రభుత్వం సరైన దిశలో ముందుకెళ్తోందని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. యూరి ఉగ్రదాడిని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ట్వీటర్లో ఖండించారు. యూరిలో ఉగ్రదాడుల్ని కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, సృ్మతి ఇరానీ, జార్ఖండ్ సీఎం రఘువర్ తీవ్రంగా ఖండించారు. యూరి దాడి అనంతరం ఒక్క పంటికి మొత్తం దవడ అనే విధానమవసరమని బీజేపీ నేత రామ్ మాధవ్ సూచించారు. కశ్మీర్ సమస్యకు ఉగ్రదాడులు పరిష్కారం కాదని..ఇలాంటి దాడులతో సమస్యలు మరింత పెరుగుతాయని, భారత్‌లో పాక్ జోక్యాన్ని సహించేది లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. వెనెజులా పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పాక్ తీరును తప్పుబట్టారు. దాడిలో మన సైనికుల మరణ వార్త తెలియగానే తీవ్రంగా బాధపడ్డానని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక జమ్మూ కశ్మీర్లో హింసను ప్రేరేపించే లక్ష్యంతోనే ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ తెలిపారు. -
ఉగ్రఘాతుకం
⇒ కశ్మీర్లో యూరి సైనిక స్థావరంపై పాక్ ఉగ్రవాదుల దాడి ⇒ 20 మంది జవాన్ల మృతి.. 20 మందికి గాయాలు ⇒ నలుగురు ముష్కరులనూ మట్టుబెట్టిన సైన్యం ⇒ వేకువజామున ఫెన్సింగ్ వైర్లు కత్తిరించి క్యాంపులోకి ప్రవేశించిన టైస్టులు ⇒ గ్రెనేడ్లు విసురుతూ, తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు ⇒ సైనిక గుడారాలకు అంటుకున్న మంటలు ⇒ మంటల్లోనే ఆహుతైన 13 మంది జవాన్లు ⇒ దాడి పాక్‌లోని జైషే ఉగ్రవాద సంస్థ పనే! ⇒ ఖండించిన రాష్ట్రపతి, ప్రధాని, సోనియా ⇒ హుటాహుటిన కశ్మీర్‌కు ఆర్మీ చీఫ్ ⇒ భద్రతా దళాధికారులతో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ ఉన్నతస్థాయి సమీక్ష యూరి/న్యూఢిల్లీ ఆదివారం వేకువజాము 5.30 గంటలు.. కశ్మీర్‌లోని యూరి పట్టణం.. అప్పుడే తెలతెలవారుతోంది.. ఎలా వచ్చారో తెలియదు.. నలుగురు పాక్ ముష్కరులు.. పెద్ద ఎత్తున ఆయుధాలు.. పేలుడు పదార్థాలతో సైనిక స్థావరంపై విరుచుకుపడ్డారు.. టెంట్ల కింద నిద్ర పోతున్న జవాన్లపై విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు.. బాంబులు విసిరారు.. కళ్లుమూసి తెరిచేలోపు 20 మందిని పొట్టనబెట్టుకున్నారు! వెంటనే తేరుకున్న సైనికులు నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు!! గత 25 ఏళ్లలో కశ్మీర్లో మన సైన్యంపై జరిగిన అతిపెద్ద దాడి ఇది. ఈ ఘటనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, అమెరికా అధ్యక్షుడు ఒబామా సహా పలు దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు. ఇది పిరికిపందల చర్య అని, దాడికి పాల్పడ్డవారిని వదిలే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేరుగా పాక్ పేరును ప్రస్తావిస్తూ నిప్పులు చెరిగారు. ఉగ్రవాదులకు సాయమందిస్తున్న పాక్‌ను ఏకాకిని చేయాలంటూ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. మంటలకు ఆహూతైనవారే ఎక్కువ.. ముష్కరులు దాడి జరిపిన యూరి సైనిక స్థావరం నియంత్రణరేఖకు కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దీని సమీపంలోనే 12 బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్ కూడా ఉన్నాయి. వేకువజాము కావడంతో కొందరు సైనికులు ఇంకా టెంట్ల కింద నిద్రిస్తున్నారు. ఇదే సమయంలో స్థావరం వెనుకభాగంలో ఫెన్సింగ్ వైర్లను కత్తిరించి క్యాంపులోకి ప్రవేశించారు. గ్రెనేడ్లు విసురుతూ, తుపాకులతో విచక్షణ రహితంగా కాలుస్తూ నలుగురు నాలుగు దిక్కులా వెళ్లారు. గ్రెనేడ్లు విసరడంతో టెంట్లకు నిప్పంటుకుంది. మంటలు సమీపంలోని బ్యారక్లకు కూడా వ్యాపించాయి. ముష్కరుల కాల్పుల కంటే మంటల్లో చిక్కుకొనే ఎక్కువ మంది సైనికులు మరణించారు. చనిపోయిన 20 మంది జవాన్లు డోగ్రా రెజిమెంట్‌కు చెందినవారే. మరో 20 మంది సైనికులు గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హెలికాప్టర్ ద్వారా 70 కి.మీ. దూరంలో ఉన్న శ్రీనగర్‌లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. మూడు గంటలపాటు ముష్కరులు-సైన్యం మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. బాంబుల మోత, కాల్పుల శబ్దంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఉదయం 8.30 గంటలకల్లా నలుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. అనంతరం ఆ ప్రాంతమంతా జల్లడపట్టింది. పాక్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు బలగాలు భావిస్తున్నాయి. యూరికి హుటాహుటిన ఆర్మీ చీఫ్ దాడి సంగతి తెలియగానే ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ హుటాహుటిన యూరికి వెళ్లారు. రక్షణమంత్రి మనోహర్ పారికర్ కూడా గోవా పర్యటనను రద్దు చేసుకొని శ్రీనగర్ వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రష్యా, అమెరికా పర్యటనను రద్దు చేసుకొని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో కలిసి ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. డీజీఎంవో (డెరైక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్) లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్‌సింగ్ పాక్ డీజీఎంవోకు ఫోన్ చేశారు. ఆయుధాలపై పాక్ గుర్తులు ఉగ్రవాదులు హతమయ్యాక వారి నుంచి బలగాలు నాలుగు ఏకే 47 తుపాకులు, నాలుగు గ్రెనేడ్ లాంఛర్లు, పెద్దఎత్తున పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకుయి. ఆ ఆయుధాలపై పాక్‌కు సంబంధించిన గుర్తులున్నాయి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ డీజీఎంవో రణ్‌బీర్ సింగ్ పాక్ డీజీఎంవోను తీవ్ర స్వరంతో నిలదీశారు. ‘‘ఉగ్రవాదుల వద్ద దొరికిన ఆయుధాలపై పాక్ చిహ్నాలున్నాయి. ఇదే విషయాన్ని ఆ దేశ డీజీఎంవోకు చెప్పాను. ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడం, బాంబులు విసరడంతో టెంట్లకు నిప్పంటుకుంది. చనిపోయిన 17 మందిలో 13-14 మంది మంటల్లో చిక్కుకొని మృతి చెందారు’’ అని రణ్‌బీర్ సింగ్ ఢిల్లీలో వెల్లడించారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో మరణించారు. యూరిలో ఇంకా కూంబింగ్ జరుపుతున్నట్లు వివరించారు. ఉగ్రవాదుల దాడి జరగొచ్చని నిఘా వ ర్గాలు ఇటీవలే హెచ్చరించాయని, అందుకు అనుగుణంగా అన్ని విభాగాలు చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. కాగా, ముష్కరుల పోరులో వీరమరణం పొందిన సైనికులను చూసి గర్విస్తున్నామంటూ ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. -
'దెబ్బకు దెబ్బే సమాధానం'
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని యురి సెక్టార్లోగల ఆర్మీ బెటాలియన్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదుల దాడిపట్ల కేంద్ర హోంశాఖ మాజీ సెక్రటరీ ఆర్కే సింగ్ తీవ్రంగా ప్రతిఘటించారు. దీనికి దెబ్బకు దెబ్బే సమాధానం అని చెప్పారు. ఇది ఉగ్రవాదుల దాడిగానే భావిస్తే అంతరాత్మను మోసం చేసుకోవడమే అవుతుందని, ఈ దాడి వెను పాక్ ఆర్మీ, ఐఎస్ఐ హస్తం ఉందని ఆయన అన్నారు. పేరుకే ఉగ్రవాదుల దాడిలా కనిపిస్తుందని చెప్పారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి దాడిని తలపించేలా తిప్పికొట్టడమే ప్రత్యామ్నాయం అని చెప్పారు. ఆదివారం వేకువజామున యురి సెక్టార్లో ఆర్మీ బెటాలియన్ ప్రధాన కార్యాలయంపై జవానులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య జరిగిన పోరాటంలో 17 మంది జవాన్లు వీర మరణం పొందగా, 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను శ్రీనగర్‌లోని ఆర్మీ బేస్ ఆసుత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
17 మంది జవాన్ల వీరమరణం
-
17 మంది జవాన్ల వీరమరణం
బరాముల్లా(జమ్మూ కశ్మీర్): జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భారత్‌కు చెందిన అత్యంత కీలక బేస్ క్యాంపుపై ఉగ్రవాదులు ఆదివారం తెల్లవారుజామున దాడికి పాల్పడ్డారు. యురి సెక్టార్లో ఆర్మీ బెటాలియన్ ప్రధాన కార్యాలయంపై జవానులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారు. ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో 17 మంది జవాన్లు వీర మరణం పొందగా, 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను శ్రీనగర్‌లోని ఆర్మీ బేస్ ఆసుత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బారాముల్లాలోని యురిసెక్టార్లోని ఆర్మీ బెటాలియన్ 12వ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయం లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ)కి అతి సమీపంలో ఉంది. తెల్లవారుజామున చీకటిగా ఉన్న సమయంలో ఫెన్సింగ్ తొలగించి ముష్కరులు లోపలికి ప్రవేశించినట్టు తెలుస్తోంది. పటాన్ కోట్లో జరిగిన ఉగ్రదాడి కన్నా ఈ దాడిలో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. సైన్యం జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను హతమయ్యారు. ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రహోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా, అమెరికాపర్యటనలను వాయిదా వేసుకొని సంబంధిత ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశం కానున్నారు. జమ్మూ కశ్మీర్ గవర్నర్, సీఎంతో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ఉగ్రవాదుల దాడితో సరిహద్దు ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ కశ్మీర్ బయలుదేరారు. గాయపడిన సైనికులను ఆసుపత్రిలో పరామర్శించనున్నారు.