
ప్రతీకాత్మక చిత్రం
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని నౌషెరాలో బుధవారం భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతిచెందారు. నౌషెరా సెక్టార్‌లో ఉగ్ర కదలికలపై సమాచారం అందటంతో భారత బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయని ఆర్మీ అధికారులు తెలిపారు. కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న క్రమంలో ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందినట్టు వెల్లడించారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పారు.
మంగళవారం ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన మనోజ్ ముకుంద్ నరవాణే.. పొరుగుదేశం ఉగ్రవాదానికి ఊతం ఇవ్వడం మానని పక్షంలో ఆదేశంలో ఉగ్రమూలాలను దెబ్బతీసే హక్కు భారత్‌కు ఉందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.