భారతదేశ కిరీటం జమ్మూ, కశ్మీర్‌లో 1999 నవంబర్ నుంచి ఇప్పటి వరకు, దాదాపు 17 సంవత్సరాల్లో భద్రతాదళాలపై మొత్తం 19 దాడులు జరిగాయి. దాదాపు 130 మందికి పైగా సిబ్బంది వీర మరణం పొందారు. దాడుల వివరాలు..
- 1999 నవంబర్ 3: శ్రీనగర్‌లోని బదామీ బాగ్‌లో ఆర్మీ కార్యాలయంపై దాడి. 10 మంది ఆర్మీ సిబ్బంది మరణం.
- 2002 మే 14: జమ్మూలోని కాలూచక్‌లో ఉన్న ఆర్మీ కంటోన్మెంట్‌పై దాడి. 36 మంది మృతి. 48 మందికి గాయాలు.
- 2003 జూలై 22: అఖ్నూర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల బృందం ఆర్మీ శిబిరంపై దాడి. 8 మంది భద్రతా దళ సిబ్బంది మృతి.
- 2005 ఏప్రిల్ 6: ఒక పర్యాటక రిసెప్షన్ కేంద్రంపై ఇద్దరు ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి.
- 2006 అక్టోబర్ 5: శ్రీనగర్ నడిబొడ్డున ఉగ్ర దాడి. ఐదుగురు పోలీసులు, ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లు, ఒక పౌరుడి మరణం.
- 2013 మార్చి 31: సీఆర్‌పీఎఫ్ శిబిరంపై దాడి. ఐదు మంది జవాన్ల వీర మరణం.
- 2013 జూన్ 24: శ్రీనగర్‌లోని హైదర్‌పొరాలో మిలిటరీ వాహన శ్రేణిపై దాడి. 8 మంది జవాన్లు మృతి.
- 2013 సెప్టెంబర్ 26: కశ్మీర్‌లలో జంట ఆత్మాహుతి దాడులు. ముగ్గరు ఉగ్రవాదులతో పాటు 10 మంది మరణం.
- 2014 నవంబర్ 27: అర్నియా సెక్టార్‌లోని కఠార్ గ్రామంలో ఎన్‌కౌంటర్. ముగ్గురు ఆర్మీ సిబ్బంది, ముగ్గురు ఉగ్రవాదులు, నలుగురు పౌరులు సహా మొత్తం 10 మంది మృతి.
- 2014 డిసెంబర్ 5: యూరి సెక్టార్‌లోని ఆర్మీ 31వ ఫీల్డ్ రెజిమెంట్ ఆర్డినెన్స్ శిబిరంపై ఉగ్రవాదుల దాడి. ఆర్మీకి చెందిన ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఏడుగురు జవాన్లు, రాష్ట్ర పోలీసుల్లో ఒక ఏఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల మృతి. ఆరుగురు ఉగ్రవాదులు కూడా.
- 2015 మార్చి 20: కఠువా జిల్లాలోని పోలీస్ స్టేషన్‌పై ముష్కరుల దాడి. ముగ్గురు భద్రతా దళాల సిబ్బంది, ఇద్దరు పౌరుల మృతి.
- 2015 మార్చి 21: సాంబ జిల్లాలోని జమ్మూ-పఠాన్‌కోట్ ఆర్మీ శిబిరంపై ఇద్దరు ఉగ్రదాడి. తిప్పికొట్టి హతమార్చిన భద్రతా దళాలు.
- 2015 మే 31: కుప్వారా జిల్లాలో బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంపై దాడికి ఆరుగురు ఉగ్రవాదుల యత్నం. తిప్పి కొట్టిన ఆర్మీ. నలుగురు ఉగ్రవాదులు హతం.
- 2015 నవంబర్ 18: కుప్వారా అడవుల్లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్. పారా కమాండోకు చెందిన కల్నల్ మృతి.
- 2015 నవంబర్ 25: కుప్వారా జిల్లా తంఘదర్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఆర్మీ శిబిరంపై ఉగ్రవాదుల దాడి. ఒక జనరేటర్ ఆపరేటర్, ముగ్గురు ఉగ్రవాదులు హతం.
- 2015 డిసెంబర్ 7: అనంతనాగ్ జిల్లాలోని బిజ్‌బెహరా వద్ద సీఆర్‌పీఎఫ్ వాహన శ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు. ఆరుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లకు గాయాలు.
- 2016 ఫిబ్రవరి 21: శ్రీనగర్ దగ్గర్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో మొత్తం (సిబ్బంది, ఉగ్రవాదులు కలిపి) 7 మంది మృతి.
- 2016 జూన్ 25: శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై వెళ్తున్న సీఆర్‌పీఎఫ్ వాహన శ్రేణిపై ఉగ్రదాడి. 8 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది మృతి. 20 మందికి గాయాలు.
- 2016 సెప్టెంబర్ 18: యూరి సెక్టార్‌లోని ఆర్మీ 12వ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంపై దాడి. 17 మంది జవాన్లు మృతి.