ఆదివారం వేకువజాము 5.30 గంటలు.. కశ్మీర్‌లోని యూరి పట్టణం.. అప్పుడే తెలతెలవారుతోంది.. ఎలా వచ్చారో తెలియదు.. నలుగురు పాక్ ముష్కరులు.. పెద్ద ఎత్తున ఆయుధాలు.. పేలుడు పదార్థాలతో సైనిక స్థావరంపై విరుచుకుపడ్డారు.. టెంట్ల కింద నిద్ర పోతున్న జవాన్లపై విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు.. బాంబులు విసిరారు.. కళ్లుమూసి తెరిచేలోపు 17 మందిని పొట్టనబెట్టుకున్నారు! వెంటనే తేరుకున్న సైనికులు నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు!! గత 25 ఏళ్లలో కశ్మీర్‌లో మన సైన్యంపై జరిగిన అతిపెద్ద దాడి ఇది.