
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామాలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో 44 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. దాడికి పాల్పడిన ఉగ్రమూకలకు దీటుగా బదులివ్వాలనే డిమాండ్ పెల్లుబుకుతోంది. మరోవైపు ఈ దాడిలో పాకిస్తాన్ హస్తం ఉందని సుస్పష్టంగా వెల్లడవుతోందని 2016లో పాకిస్తాన్‌పై భారత్ నిర్వహించిన సర్జికల్ స్ర్టైక్స్‌ను పర్యవేక్షించిన లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) డీఎస్ హుడా తేల్చిచెప్పారు.
.పాకిస్తాన్ పుల్వామా దాడిపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు మరింత నిలకడతో కూడిన దీర్ఘకాలిక విధానం అవసరమని హుడా అభిప్రాయపడ్డారు. కాగా పుల్వామా దాడికి బాధ్యులైన వారిని ఉపేక్షించమని, దీనిపై చర్యలు చేపట్టే స్వేచ్ఛ భారత సైన్యానికి ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రతీకారం తీర్చుకునే తేదీ, సమయాన్నివారే నిర్ధారించాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment