
శ్రీనగర్ : జమ్మూ-కశ్మీర్‌లో కాల్పుల మోత మోగింది. శనివారం ఉదయం పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం రావటంతో ఆర్మీ బలగాలు అవంతిపొరలో గోరిపోరా ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. ఈ క్రమంలోనే జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులతోపాటూ వారికి సహకరిస్తున్న మరో వ్యక్తిని భద్రతాదళాలు మట్టుపెట్టాయి. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. (సీఆర్‌పీఎఫ్ శిబిరంపై గ్రనేడ్ దాడి)
Comments
Please login to add a commentAdd a comment