
కశ్మీర్‌లో ఉగ్రదాడి
సాక్షి, శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామాలో పోలీసు లైన్ల వద్ద కాపలాగా ఉన్న భద్రతా సిబ్బందిపై మెరుపు దాడికి దిగారు. ఈ ఘటనలో ఆరుగురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు, మరో ఇద్దరు పోలీసులు ఉన్నారు. ఆసుపత్రిలో ఓ జవాన్ అమరుడయ్యారు. ఈ ఘటన అనంతరం ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో భద్రతాసిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.