
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పుల్వామాలోని గుసూ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో పోలీసు, ఓ ఆర్మీ సైనికుడు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో పోలీసులు, ఆర్మీ సంయుక్త బృందంతో గుస్సా ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. అయితే అప్పటికే అక్కడ మాటువేసిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. ఇరు పక్షాలకు జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ పోలీసు, ఆర్మీ సైనికుడు గాయపడినట్టు ఓ సీనియర్ పోలీసు అధికారి ధ్రువీకరించారు. ఈ ఘటనలో ఇద్దరు నుంచి ముగ్గురు ఉగ్రవాదులకు తీవ్ర గాయాలైనట్లు అధికారులు ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు. (తెలంగాణ సైనికుడి వీరమరణం )
Comments
Please login to add a commentAdd a comment