కశ్మీర్లో కొనసాగుతున్న ఆందోళనలు
కశ్మీర్లో కొనసాగుతున్న ఆందోళనలు
Published Wed, Aug 24 2016 1:47 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
శ్రీనగర్: దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఆందోళనకారులు, భద్రతా బలగాలకు మధ్య బుధవారం జరిగిన ఘర్షణలో ఓ యువకుడు మృతి చెందాడు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో పొహు గ్రామానికి చెందిన అమిర్ బషిర్ అనే యువకుడు గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. దీంతో కశ్మీర్ ఆందోళనల్లో మృతి చెందిన వారి సంఖ్య 66 కు చేరుకుంది.
ఈ ఘటనలో పుల్వామా జిల్లాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు వెల్లడించారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వాని ఎన్కౌంటర్ నేపథ్యంలో చెలరేగిన హింస ఇప్పటికీ కొనసాగుతోంది. కశ్మీర్లో పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ అక్కడకు చేరుకున్న విషయం తెలిసిందే.
Advertisement
Advertisement