పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్ జవాన్లకు అఖిలపక్షం ఘనంగా నివాళులు అర్పించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులు అమరులకు ఘనంగా అంజలి ఘటించారు. జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.