‘పుల్వామా’ నిందితుడి అరెస్ట్‌  | NIA Arrested Pulwama Terrorist | Sakshi
Sakshi News home page

‘పుల్వామా’ నిందితుడి అరెస్ట్‌ 

Feb 29 2020 2:07 AM | Updated on Feb 29 2020 2:07 AM

NIA Arrested Pulwama Terrorist - Sakshi

న్యూఢిల్లీ: గత సంవత్సరం జరిగిన పుల్వామా దాడికి సంబంధించి ఒక కీలక నిందితుడిని నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) శుక్రవారం అరెస్ట్‌ చేసింది. అతడిని పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మొహ్మద్‌  సభ్యుడిగా గుర్తించారు. పుల్వామాలోని కాకాపొరా ప్రాంతంలోని హజిబల్‌కు చెందిన షకీర్‌ బషీర్‌ మాగ్రే పుల్వామా దాడిలో పాల్గొన్న ఆత్మా హుతి సభ్యుడు ఆదిల్‌ అహ్మద్‌ ధార్‌కు వసతి, ఇతర సౌకర్యాలు కల్పించాడు. బషీర్‌కు అక్కడ ఒక ఫర్నిచర్‌ షాప్‌ కూడా ఉంది. 2018లో పాకిస్తాన్‌ ఉగ్రవాది మొహ్మద్‌ ఉమర్‌ ఫారూఖ్‌ ద్వారా ధార్‌కు బషీర్‌ పరిచయం అయ్యాడు. ఆ తరువాత బషీర్‌.. జైషే మొహ్మద్‌ కోసం పూర్తి కాలం పనిచేశాడు. పలు సందర్భాలో ఆయుధాలు, పేలుడు సామగ్రిని ఉగ్రవాదుల కోసం సిద్ధం చేశాడని ఎన్‌ఐఏ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement