భార్య వేరొకరితో సంబంధం పెట్టుకుందని..
Published Mon, Jul 3 2017 11:07 AM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM
హైదరాబాద్: భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నగరంలోని సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. స్థానిక న్యూ రక్షాపురంలో నివాసముంటున్న గోపాల్ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య జ్యోతి, ఓ కుమారుడు ఉన్నాడు.
కాగా.. జ్యోతి మూడేళ్లుగా స్థానికంగా నివాసముంటున్న రాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ అంశంపై గోపాల్ ఆమెను పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో మనస్తాపానికి గురైన గోపాల్ సూసైడ్ నోట్ రాసి ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement