husbend suicide
-
కరోనాతో భార్య మృతి, మనస్తాపంతో భర్త ఆత్మహత్య!
అక్కిరెడ్డిపాలెం(గాజువాక): భార్య కరోనాతో మృతి చెందడంతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీవీఎంసీ 69వ వార్డు హరిజనజగ్గయ్యపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాజువాక ఎస్ఐ సూర్యప్రకాశరావు తెలిపిన వివరాలివీ.. విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన యర్రంశెట్టి సన్యాసిరావు(50) హరిజనజగ్గయ్యపాలెంలో ఇంట్లోనే టైలరింగ్ పనులు చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తున్నాడు. అతని భార్య చిన్నమ్మలు ఏప్రిల్‌లో కరోనాతో మృతి చెందింది. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపంలో ఉన్నాడు. ఈ క్రమంలో మద్యానికి అలవాటుపడ్డాడని గ్రామస్తులు తెలిపారు. శనివారం మధ్యాహ్న సమయంలో హోటల్ నుంచి భోజనం తెచ్చుకున్నాడు. దాన్ని విప్పకుండా రోడ్డుపై పడేసి.. కొద్దిసేపటి తర్వాత ఇంటి తలుపుల లోపలి గడియ పెట్టుకున్నాడు. ఇంటి యజమానికి అనుమానం వచ్చి కిటికీ నుంచి చూడగా ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే గాజువాక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సన్యాసిరావుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు, కుమార్తెకు వివాహాలు జరిగాయి. చిన్న కుమారుడు అవివాహితుడని పోలీసులు తెలిపారు. చదవండి: డెల్టా, ఒమిక్రాన్ ఒకేసారి సోకితే ఏమౌతుందో తెలుసా? కొత్త వేరియంట్ ప్రత్యేకత అదే.. -
వివాహేతర సంబంధం.. కుటుంబం నాశనం
వల్లూరు : వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని నాశనం చేసింది. మొన్న భార్య, నిన్న భర్త ఆత్మహత్య చేసుకోవడంతో.. వారి ఏడాదిన్నర కూతురు అనాథలా మారింది. వివరాల్లోకి వెళితే.. వల్లూరు మండలంలోని పుల్లారెడ్డిపేట ఎస్సీ కాలనీకి చెందిన గొడ్డు సన్నీకుమార్, దుగ్గాయపల్లెకు చెందిన కల్పన ప్రేమించుకుని, నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఒకటిన్నరేళ్ల కూతురు ఉంది. కల్పన గర్భవతి. సన్నీకుమార్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో నిలదీసింది. దీంతో ఆమెను భర్త వేధించడం మొదలు పెట్టాడు. నమ్మిన భర్తే తనను మోసం చేయడంతో ఆమె శుక్రవారం ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకుంది. అప్పటి నుంచి సన్నీకుమార్ కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో ఆయన కడప సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. కల్పన మృతదేహానికి శనివారం, సన్నీ కుమార్ మృతదేహానికి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో వారి కూతురుకు.. నాన్నమ్మే అన్నీ చూసుకోవాల్సి వస్తోంది. -
మత్తు వదిలిద్దామంటే మనిషే లేడు
కాశీబుగ్గ: మద్యం అలవాటు ఉన్న భర్తను ఎలాగైనా మార్చాలని ఆ ఇల్లాలు నిర్ణయించుకుంది. అతడిని భయపెట్టమని పోలీసులను ఆశ్రయించింది. అప్పటికైనా మారుతాడని, కుటుంబం చక్కదిద్దుకోవచ్చన్న ఆ అబల ఆలోచన బెడిసికొట్టింది. ఇంటికి పోలీసులు వచ్చారన్న అవమానంతో మనస్తాపానికి గురైన ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. పూరి–తిరుపతి రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన సంచలనం కలిగించింది. పోలీసులు, స్థానికులు కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో 3వ వార్డు తాళ్లభద్ర గ్రామానికి చెందిన రంది నీలయ్య(లేటు) కుమారుడు రంది నర్సింహులు భార్య జయలక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. నర్సింహులు, జయలక్ష్మి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం కూడా వీరి మధ్య గొడవ చోటుచేసుకుంది. అనంతరం వీరి ఇద్దరు కుమారులు చైతన్య, కిషోర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు చదువుకు వెళ్లిపోయారు. జయలక్ష్మి స్థానిక జీడిపరిశ్రమలో కూలీగా పనిచేస్తుండడంతో ఆమె అక్కడికు వెళ్లిపోయింది. అయితే ఆమె అటునుంచి అటు కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఉదయం తమ భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ విషయం పోలీసులకు తెలిపింది. తన భర్త నిత్యం మద్యం సేవించి గొడవ పడుతున్నాడని, కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉందని చెప్పింది. అతడిని మందలించి మారేటట్టు చేయాలని కోరింది. దీంతో మధ్యాహ్నం మూడు గంటలకు పోలీసులు నర్సింహులు ఇంటికి వచ్చి నర్సింహులు గురించి ఆరాతీశారు. ఇదే విషయం గ్రామం మొత్తం వ్యాపించి ఆనోటా ఈనోటా వినడంతో అవమానంగా భావించిన నర్సింహులు పూటుగా మద్యం సేవించి ఆత్మహత్యకు పూనుకున్నాడు. కళ్లముందే మరణిస్తున్నా చలించని హృదయాలు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... బుధవారం రాత్రి 7 గంటల సమయంలో తాళ్లభద్ర రైల్వే గేటువద్దకు వచ్చిన రంది నర్సింహులు గేటు వేసి ఉన్నప్పటికి గేటు కింద నుంచి వెళ్లి పలాస నుంచి బరంపురం వైపు వెళ్తున్న గూడ్సు రైలును పట్టుకోవడానికి యత్నించాడు. రైలు వేగం పుంజుకోవడంతో బయపడి వెనుదిరిగాడు. రెండు చేతులు జోడించి మరలా రైలు పట్టేందుకు ప్రయత్నించి ధైర్యం చాలక విఫలమయ్యాడు. ఇంతలో పూరి నుంచి పలాస వైపు వస్తున్న పూరి–తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురుగా పట్టాలపై నిల్చున్నాడు. రైలు డ్రైవర్ హార్న్ కొడుతున్నా పట్టించుకోలేదు. రైలుకిందపడి నలిగిపోయాడు. సుమారు 100 మీటర్ల దూరం ఇతడిని రైలు ఈడ్చుకెళ్లింది. ఇదంత చూస్తున్నా గేటువద్ద ఉన్న ప్రయాణికులు కేకలు వేయడం గాని, రక్షించే ప్రయత్నం గాని చేయలేదు. రైలు నిలిపివేయగా కొనప్రాణంతో నర్సింహులు కొట్టుమిట్టాడాడు. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి అత్యవసర వైద్యం అందిస్తుండగా చూస్తూనే ప్రాణాలు విడిచాడు. పలాస జీఆర్పీ కె.కోదండరావు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా పరిశీలించి ఆత్మహత్యగా కేసు నమోదుచేశారు. -
భార్య వేరొకరితో సంబంధం పెట్టుకుందని..
హైదరాబాద్: భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నగరంలోని సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. స్థానిక న్యూ రక్షాపురంలో నివాసముంటున్న గోపాల్ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య జ్యోతి, ఓ కుమారుడు ఉన్నాడు. కాగా.. జ్యోతి మూడేళ్లుగా స్థానికంగా నివాసముంటున్న రాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ అంశంపై గోపాల్ ఆమెను పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో మనస్తాపానికి గురైన గోపాల్ సూసైడ్ నోట్ రాసి ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.