చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: ఉపాధ్యాయ దినోత్సవం రోజున గురువులు గర్జించారు. గురుపూజోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించి ‘మాకు సమైక్యాంధ్ర మాత్రమే కావాలి’ అంటూ డప్పు కొట్టి మరీ నినదించారు. రకరకాల ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. విద్యాశాఖ, ఉపాధ్యాయ జేఏసీ పిలుపు మేరకు గురువారం జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాల్లో విభజన నిర్ణయాన్ని ఎండగడుతూ టీచర్లు నిరసన తెలిపారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులో సుమారు 3వేల మంది నల్ల దుస్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
జిల్లా పరిషత్ వద్ద చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు ర్యాలీని ప్రారంభించారు. జిల్లా గెజిటెడ్ అధికారుల జేఏసీ నేతలు, నల్లటి దుస్తులు ధరించిన ఉపాధ్యాయులతో కలిసి ఎంఎస్‌ఆర్ సర్కిల్ మీదుగా గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నేతలు తెప్పించిన 500 అడుగుల నల్ల వస్త్రాన్ని టీచర్లు ర్యాలీలో పట్టుకొని నిరసన తెలిపారు. విద్యార్థుల కోలాటాలు, పీఈటీలు లెజిమ్స్, ఉపాధ్యాయులు డప్పుతో ర్యాలీలో ముందుకుసాగారు. ‘పంతుళ్ల పంతం... వేర్పాటువాదం అంతం,గురువుల వేదన సమైక్యాంధ్ర సాధన, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కన్నా సమైక్యాంధ్ర ఉద్యమమే మిన్న, సర్వమతం సమైక్యం, విభజన ఆపండి విద్యార్థులను కాపాడండి’ అని ప్లకార్డులు చేతబూని సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.
ఓ ఉపాధ్యాయుడు యముడి వేషం వేసి, తాడుతో కేసీఆర్ ప్లకార్డు ధరించి ఉన్న టీచర్‌ను లాగుతూ ‘రాష్ట్రాన్ని విడదీస్తావా? నిన్ను పైకి తీసుకెళ్లాల్సిందే’ అంటూ అరుస్తూ ర్యాలీలో ముం దుకు సాగాడు. మరికొందరు గాంధీ విగ్రహం వద్ద డ్యా న్సులు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల నిరసనకు మద్దతుగా పలు పాఠశాలల విద్యార్థులు గాంధీ విగ్రహం చుట్టూ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈవో బీ.ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు గురుపూజోత్సవం ఎంత ముఖ్యమైందో అందరికీ తెలుసని, అయితే జిల్లా టీచర్లు అవార్డుల కన్నా సమైక్యాంధ్ర ముఖ్యమని ముందుకు రావడం అభినందనీయమన్నారు.
తిరుపతి, మదనపల్లె, శ్రీకాళహస్తి, పుంగనూరు, నగరి, పలమనేరు తదితర ప్రాంతా ల్లో నిరసన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిం చారు. చిత్తూరులో జరిగిన ఈ కార్యక్రమంలో గెజిటెడ్ అధికారుల జేఏసీ నేతలు వెంకటసుబ్బారెడ్డి, శేషయ్య, అనిల్‌కుమార్‌రెడ్డి, చంద్రమౌళి, వర్మ, జయప్రకాష్, టీచర్స్ జేఏసీ నేతలు గిరిప్రసాద్‌రెడ్డి, శ్రీరామమూర్తి, రవీంద్రారెడ్డి, రవిరెడ్డి, వెంకటేశ్వర్లు, బాబు, దామోద రం, నరేంద్రకుమార్, మఫిషియల్ అసోసియేషన్ నేత లు పురుషోత్తం, మురళీమోహన్, రవిశేఖర్, ప్రేమ్‌కుమార్, గోపాల్, సహదేవనాయుడు పాల్గొన్నారు.
గుణ‘పాఠం’ చెబుతాం
Published Fri, Sep 6 2013 6:15 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM
Advertisement
Advertisement