మైకేల్ అభిమాని కథ
పాప్‌స్టార్ మైకేల్ జాక్సన్‌కి ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులు ఉంటారు. అలాంటి ఓ అభిమాని కథతో రూపొందుతున్న చిత్రం ‘మిరాకిల్’. జయ్ శ్రీనివాస్‌రాజ్ సమర్పణలో తిరుమల వెంచర్స్ పతాకంపై ఉదయ్‌బాబు నిర్మిస్తున్నారు. గోపాల్ దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటిస్తున్నారు.
ఈ చిత్రవిశేషాలను ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఆనంద్ వంగా తెలియజేస్తూ -‘‘ఈ చిత్రాన్ని మైకేల్ జాక్సన్‌కి అంకితం చేస్తున్నాం.ఇందులో మైకేల్‌గా, ఆయన అభిమానిగా గోపాల్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
అలాగే కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలతో పాటు మ్యూజిక్, ఎడిటింగ్ కూడా గోపాలే చేయడం విశేషం. సంగీత ప్రధానంగా సాగే ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సత్యనారాయణ్.