వాటర్ హీటర్ పెడుతూ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం చేగూరు పంచాయతీ పరిధిలోని వెంకమ్మగూగ గ్రామంలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. గోపాల్ (35) అనే వ్యక్తి నీళ్లు వేడి చేసుకునేందుకు ఇంటి దగ్గర వాటర్ హీటర్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.