కోస్గి : తండ్రి మందలించడంతో కొడుకు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా కోస్గి మండలం బిజ్జారం గ్రామపంచాయతీ పరిధిలోని గిరిమోనిపల్లెకు చెందిన పదేళ్ల వెంకటేష్‌ను ఎండలో బయట తిరగొద్దని తండ్రి గోపాల్ మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు మంగళవారం మధ్యాహ్నం ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్ లో కోస్గి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు.