యువతరం ఇష్టసఖి
యువతరం ఇష్టసఖి
Published Tue, Nov 26 2013 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM
అజయ్, వరుణ్, శ్రీరామ్, భాస్కర్, అనుస్మృతి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘ఇష్టసఖి’. శ్రీహరి ప్రత్యేక పాత్ర పోషించిన ఈ చిత్రానికి భరత్ పారేపల్లి దర్శకుడు. వింజమూరి మధు నిర్మాత. ఈ నెల 29న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విలేకరులకు ప్రదర్శించారు. కాలేజ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా యుత్‌ని ఆకట్టుకుంటుందని, శ్రీహరి తనకోసమే ఇందులో నటించారని, ఆయన లేకపోవడం బాధగా ఉందని దర్శకుడు అన్నారు. చిత్ర బృందంతో పాటు పంపిణీదారుడు గోపాల్, బాలాజీ నాగలింగం, సీతారాం, పైడిబాబు, రవి కూడా పాల్గొన్నారు.
Advertisement
Advertisement