- ఆనవాయితీ కొనసాగిస్తాం: ఈవో గోపాల్
ఖమ్మం: భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు ప్రతీ ఏడాదిలాగే 2015లోనూ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు పంపిస్తామని టీటీడీ కార్యనిర్వహణ అధికారి ఎం.జి. గోపాల్ తెలిపారు. ఆదివారం ఆయన ఖమ్మంలో ‘సాక్షి’తో మాట్లాడారు. ఆంధ్ర, తెలంగాణ ఉమ్మడి రాష్ర్టంగా ఉన్నప్పుడు పట్టువస్త్రాలు టీటీడీ నుంచే అందించామని, రాష్ట్రం విడిపోయాక కూడా ఆనవాయితీ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. భద్రాచాలం రామాలయ కమిటీ కోరితే ఇక్కడికి కూడా బంగారు తాపడం పంపిస్తామని చెప్పారు.