puspayagam
-
Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా పుష్పాలంకరణ (ఫొటోలు)
-
నేడు పుష్పయాగోత్సవం
నేటితో ముగియనున్న నృసింహుడి బ్రహ్మోత్సవాలు ఖాద్రీ లక్ష్మీ నృసింహుడి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగియనుండడంతో శ్రీవారి ఆలయ ప్రాంగణంలో పుష్పయాగోత్సవం నిర్వహించనున్నారు. ఆలయంలోని కళ్యాణ మండపంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన శ్రీదేవి, భూదేవి సమేత వసంత వల్లభుడు భక్తులను ఆశీర్వదిస్తారు. బ్రహ్మోత్సవాలకు నలుదిక్కుల నుంచి విచ్చేసిన ఇంద్రాది అష్ట దిక్పాలకులు, ముక్కోటి దేవతలకు కృతజ్ఞతలతో చందన పుష్ప తాంబూలాలు సమర్పించి, వారిని వారి వారి లోకాలకు సాగనంపుతారు. తొలుత నవ కలశ ప్రతిష్ట, వాస్తు హోమాలు జరిపి, ఆలయ మహా సంప్రోక్షణ గావిస్తారు. శ్రీవారికి నిత్యకైంకర్యములు పూర్తిచేసి, తర్వాత విశేష పూల అలంకరణ, మంగళ హారతులు ఇచ్చి, పుష్పయాగోత్సవం ముగిస్తారు. ఉభయదారులుగా రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పూల అశ్వర్థనారాయణ కుటుంబ సభ్యులు వ్యవహరిస్తారని ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డి, చైర్మన్ నరేంద్రబాబు తెలిపారు. -
పుష్పయాగం వైభవం
-
వేడుకగా శ్రీవారికి పుష్పార్చన
శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వార్లకు పుష్పయాగం కార్యక్రమానికి తిరుమలలో బుధవారం మధ్యాహ్నం అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయం లోపల కల్యాణోత్సవ మండపంలో ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పుష్పయాగం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం సాయంత్రం వరకు జరుగుతుంది. ఈ యాగం కోసం 7 టన్నుల పుష్పాలు, పత్రాలను సిద్ధం చేశారు. 12 రకాల పుష్పాలు, ఆరు రకాల పత్రాలతో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కాగా, శ్రీవారి దర్శనార్థం గవర్నర్ నరసింహన్ తిరుమల చేరుకున్నారు. ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. -
వైభవంగా పుష్పాల ఊరేగింపు
తిరుమల : అలంకార ప్రియుడైన వేంకటేశ్వరస్వామి సేవకు పుష్పాలు తరలివచ్చాయి. తిరుమల వేంకటేశ్వరస్వా మి ఆలయంలో శుక్రవారం పుష్పయాగం జరిగింది. ఈ మేరకు శ్రీవారి పుష్పయాగంలో 6 రకాల ఆకులు, 12 రకాల పుష్పాలను వినియోగించారు. టీటీడీ ఉద్యానవనం నుంచి ఆలయ వరకు ఈ పుష్పాలను శ్రీవారిసేవకులు, టీటీడీ ఉద్యోగులు బుట్టల ద్వారా తీసుకువచ్చారు. గోవింద నామస్మరణలు చేస్తూ స్వామి సేవకు పుష్పాలను, పత్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. స్వామిని తాకే పుష్పాలను తమ చేతుల ద్వారా తీసుకురావటం పూర్వజన్మ సుకృతమంటూ శ్రీవారి సేవకులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, అంతకుముందు ఊరేగింపునకు ప్రారంభంలో జేఈవో శ్రీనివాసరాజు, ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, ఉద్యానవనం సూపరిటెండెంట్ శ్రీనివాసులు ఉద్యానవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
నేత్రపర్వంగా కల్యాణ వెంకన్న పుష్పయాగం
చంద్రగిరి, న్యూస్లైన్ : శ్రీనివాసమంగాపురంలోని కల్యాణవేంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం పుష్పయాగ కైంకర్యం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ అర్చక బృందం వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా పూజా కైంకర్యాలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అభిషేకించారు. ఉత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామిని కొలువుంచారు. అంతకు ముందు స్వామి అమ్మవార్లకు సంప్రదాయబద్ధంగా పూజా కైంకర్యాలు నిర్వహించారు. దేశ విదేశాల నుంచి తెప్పించిన పుష్పాలతో అభిషేకించారు. వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య వెయ్యి కిలోల పుష్పాలతో కల్యాణ వెంకన్నను అభిషేకించారు. టీటీడీ ఈవో గోపాల్, జేఈవో భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు పుష్పాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. -
పుష్పాభిషేకం
కలియుగ ప్రత్యక్ష దైవం, అలంకార ప్రియుడైన శ్రీవేంకటేశ్వరస్వామి హృదయంపై పుష్ప దేవతలు సేదతీరాయి. స్వామి వారి పుష్పయాగం కోసం తరలించిన సుగంధ భరిత పుష్పాలను చూసి భక్తులు తన్మయం చెందారు. టీటీడీ ఉద్యోగులు, శ్రీవారి సేవకులు స్వామి సేవకు పుష్పాలను మోసుకె ళ్లడం పూర్వజన్మ సుకృతంగా భావించారు. తిరుమల, న్యూస్లైన్: శ్రీవారి ఆలయంలో ఆదివారం పుష్పయాగం కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. టీటీడీ గార్డెన్ విభాగం వారు స్వామివారి కైంకర్యానికి ఎనిమిది టన్నుల బరువు కలిగిన 12 రకాల పుష్పా లు, 6 రకాల పత్రాలను వెదురు బుట్టల్లో తరలించా రు. ఇందులో చామంతి, లిల్లీ, వృక్షి, రోజాలు, మల్లె లు, కనకాంబరాలు, తామరలు, కలువలు, మొగలిరేకులు, మాను సంపంగి వంటి పుష్పాలతో పాటు మరువం, దవణం, బిల్వం, కదిరిపచ్చ, పన్నీరాకు, తులసి పత్రాలు ఉన్నాయి. అలాగే ఈ ఏడాది అత్యంత ధర కలిగిన మదిలం పుష్పాలను కూడా పుష్పయాగంలో వినియోగించారు. కార్యక్రమంలో భాగంగా తిరుమల పాపవినాశనం మార్గంలోని టీటీడీ గార్డెన్ నుంచి వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలను టీటీడీ ఉద్యోగులు, శ్రీవారి సేవకులు గోవింద నామ స్మరణల మధ్య ఆలయం వద్దకు గంపలతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఇన్ని రకాల పుష్పాలను ఒకేసారి చూసిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. మరికొంత మంది సేవకులు స్వామి కైంకర్యానికి పుష్పాలను తీసుకెళ్లటం పూర్వజన్మ సుకృతంగా భావించారు. నా జీవితంలో ఇన్ని రకాల పుష్పాలను చూడలేదు నేను శ్రీవారి సేవ చేయటం కోసం తిరుమలకు వచ్చాను. నా జీవితంలో ఇన్ని రకాల పుష్పాలను ఎక్కడా చూడలేదు. మళ్లీ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనాలనిపిస్తోంది. నాతో పాటు నా స్నేహితులు కూడా పుష్పయాగంలో వినియోగించే పుష్పాలను తీసుకువచ్చారు. - వరలక్ష్మీ, ఆకివీడు పూర్వజన్మ సుకృతం స్వామి సేవకు నా చేతుల మీదుగా పుష్పాలను తీసుకురావటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. గోవిందనామ స్మరణలు చేస్తూ పుష్పాలను తీసుకురావటం ఎంతో సంతోషాన్ని కల్గించింది. ఇది దేవుడిచ్చిన ఓ గొప్ప వరంగా, అదృష్టంగా భావిస్తున్నాను. - దేముళ్లు, విశాఖపట్నం