19 రోజులు.. రూ.1.35 కోట్లు
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీల ఆదాయాన్ని మంగళవారం లెక్కించా రు. ఆలయ ఆవరణలో ఈవో వేండ్ర త్రినాథరావు పర్యవేక్షణలో లెక్కింపు జరిగింది. 19 రోజులకు నగదు రూపంలో రూ. 1,35,45,752, కానుకల రూపంలో 371 గ్రాముల బంగారం, 4.236 కిలోల వెండి లభించినట్టు ఈవో తెలిపారు. ఓ విదేశీ భక్తుడు అమెరికన్ కరెన్సీ నోట్ల కట్టను హుండీలో సమర్పించాడని, దీంతో పాటు ఇతర దేశాల కరెన్సీ నోట్లు లభించాయని చెప్పారు.