బేతంచర్ల : కర్నూలు జిల్లా బేతంచర్ల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలోని హుండీని దేవాదాయ శాఖ అధికారులు సోమవారం లెక్కించారు. ఆలయ ఈవో తిమ్మానాయుడు ఆధ్వర్యంలో ఈ లెక్కింపు కార్యక్రమం జరిగింది. గత మూడు నెలలుగా హుండీ లెక్కింపు జరగలేదని ఈ సందర్భంగా ఈవో తెలిపారు. సోమవారం జరగిన హుండీ లెక్కింపులో రూ. 40లక్షల 13వేల మూడువందల నగదును భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి సమర్పించుకున్నారు. అంతేకాకుండా 24 తులాలకు పైగా బంగారం, 4కేజీల 245గ్రామలు వెండి ఆభరణాలు కానుకల రూపంలో వచ్చాయని ఈవో తెలిపారు.