![Tirumala TTD Issue Sarvadarshanam Tickets From 8th September - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/7/Tirumala-TTD.jpg.webp?itok=7u7ecFqM)
సాక్షి, తిరుమల: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 8(రేపు బుధవారం) నుంచి సర్వదర్శనం పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 8 ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. రోజుకి 2 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. (చదవండి: టికెట్ల ఇక్కట్లకు చెక్! )
తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో సర్వరద్శనం టికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. అయితే, ప్రస్తుతం చిత్తూరు జిల్లా వాసులకు మాత్రతే సర్వ దర్శంన టోకెన్లు జారీని పరిమితం చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. కరోనా విజృంభణ కారణంగా 6 నెలలుగా సర్వదర్శనాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment