Tirumala: పెరిగిన భక్తుల రద్దీ..  31 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు | Tirumala Oct 06 2023 Updates | Sakshi
Sakshi News home page

పెరిగిన భక్తుల రద్దీ..  31 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు

Published Fri, Oct 6 2023 7:54 AM | Last Updated on Fri, Oct 6 2023 7:54 AM

Tirumala Oct 06 2023 Updates - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు భక్తులు. సర్వ దర్శనానికి 12 గంటలు.. ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 

ఇక గురువారం శ్రీవారిని 68,558 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.13 కోట్లుగా తేలింది. 29,508 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

ఇదిలా ఉంటే.. నేడు నేడు డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరగనుందని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. 

కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకా­రం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మో­త్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తా­రు.

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ప్రధానంగా ఈ నెల 19న గరుడ వాహనం, 20న పుష్పకవిమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం జరుగనున్నాయి. ఉదయం వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహ­నసేవ 7 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడ వాహనసేవ రాత్రి 7 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement