
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి భక్తులకు నేటి నుంచి ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభమైంది. కోవిడ్- 19 మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడానికి నిలిపి వేసిన ఆఫ్ లైన్ టికెట్ల జారీ ప్రక్రియను నేటి నుంచి కొనసాగించనున్నారు. ఫిబ్రవరి 16న (బుధవారం) దర్శనం కోసం ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీగోవింద రాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా టీటీడీ టోకెన్లను జారీ చేస్తోంది. తెల్లవారుజామున నుంచే టికెట్ల కోసం భక్తులు బారులు తీరారు.
Comments
Please login to add a commentAdd a comment