tokens
-
23 నుంచి శ్రీవారి సర్వ దర్శనానికి టోకెన్లు ఇవ్వనున్న టీటీడీ
-
బాబు పాపాలే యమపాశాలై!
సాక్షి, అమరావతి: కలియుగ వైకుంఠం తిరుమల–తిరుపతిని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం భ్రష్టు పట్టించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పాపాలే అమాయక భక్తుల పాలిట యమపాశాలుగా మారాయి! కక్ష సాధింపు చర్యలతో తిరుమల పవిత్రతకు కళంకం తేవాలన్న కుట్రతో సమర్థ టీటీడీ వ్యవస్థను దిగజార్చారు. ఇక తిరుమల–తిరుపతిని వేదికగా చేసుకుని ఉప ముఖ్యమంత్రి సాగించిన సనాతన డ్రామా శ్రీవారి దివ్యక్షేత్రం పవిత్రతకు భంగం కలిగించి పటిష్ట వ్యవస్థను దెబ్బతీసింది. తన వందిమాగదులను రాజ్యాంగేతర శక్తులుగా మార్చి తిరుమల–తిరుపతిలో తిష్ట వేయించిన సీఎం చంద్రబాబు నిర్వాకాలే అమాయకుల అకాల మరణానికి కారణ భూతమ య్యా యి. లక్షలాది మంది తరలి వస్తారని తెలిసినా సరే కనీస ఏర్పాట్లలో తీవ్ర అల సత్వమే తిరుమల–తిరుపతి చరిత్రలో తొలిసారి తొక్కిసలాటకు దారితీసి పెను విషాదాన్ని మిగిల్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. తిరుపతిలో ఆరుగురు భక్తుల దుర్మరణం పూర్తిగా చంద్రబాబు సర్కారు చేసిన హత్యలేనన్నది స్పష్టం! దీన్ని దురదృష్టకర ఘటనగా ముద్ర వేసి తన వైఫల్యాలను కప్పిపుచ్చుతూ పక్కదారి పట్టించేందుకు యత్నిస్తోంది. ఈ ఉదంతంలో ప్రధాన ముద్దాయి ముఖ్యమంత్రి చంద్రబాబేనన్నది యావత్ భక్త కోటి ఏకాభిప్రాయం. ఓ ప్రణాళిక లేదు.. సమీక్షలూ లేవుతిరుమలకు రోజూ 80 వేల మంది భక్తులు వస్తుంటారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఏటా 7 లక్షల మంది శ్రీవారి దర్శనం చేసుకుంటారు. గతంలో ఎన్నడూ ఇలాంటి దుర్ఘటన జరగలేదు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీకి టీటీడీ ఏటా తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తుంది. తిరుమల జేఈవో నేతృత్వంలో టీటీడీ విజిలెన్స్, రెవెన్యూ, తిరుపతి పోలీసులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. క్యూలైన్లలో భద్రత, ఇతర సౌకర్యాలను ఈవో, జేఈవో, ఎస్పీ, కలెక్టర్ పర్యవేక్షిస్తారు. అదనపు ఎస్పీ, ఆర్డీవో, డీఎస్పీలు, తహశీల్దార్లు, భారీ సంఖ్యలో టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులు 24 గంటలూ అక్కడే ఉంటూ ప్రణాళిక కచ్చితంగా అమలయ్యేలా చూస్తారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం, ప్రస్తుత పాలక మండలి వీటిపై దృష్టి పెట్టలేదు. టికెట్ల జారీకి కనీస మార్గదర్శకాలను పాటించలేదు. టికెట్ల జారీ ప్రణాళిక, ఏర్పాట్లను సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షించ లేదు. కనీసం అధికారులను ఆరా కూడా తీయలేదు.సర్కారు వైఫల్యాలకు రుజువులివిగో..వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్లను జనవరి 9వ తేదీ తెల్లవారుజాము నుంచి జారీ చేస్తామని టీటీడీ ప్రకటించింది. టోకెన్ల కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుపతి చేరుకుని ముందు రోజు మధ్యాహ్నం నుంచే క్యూ లైన్లలో వేచి చూస్తారని తెలిసినా తగిన ఏర్పాట్లు చేయలేదు. శ్రీనివాసం, బైరాగిపట్టెడలోని ఎంజీవో పాఠశాలతోపాటు ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్దకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకోగా టీటీడీ వారిని క్యూ లైన్లలోకి అనుమతించకుండా రోడ్లపైనే నిలబెట్టేసింది. వచ్చినవారిని వచ్చినట్టుగా క్యూలైన్లలోకి పంపించి టికెట్లు జారీ చేసి ఉంటే భక్తులు సులభంగా ముందుకు కదులుతూ టికెట్లు తీసుకుని బయటకు వచ్చేవారు. కానీ క్యూ లైన్లలోకి అనుమతించకుండా ప్రవేశ ద్వారం వద్దే గంటల తరబడి పడిగాపులు కాసేలా చేశారు. మరోవైపు ఎముకలు కొరికే చలిలో భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు.భోజనం, ఇతరత్రా అవసరాలకు బయటకు వెళితే మళ్లీ రద్దీలో రాలేమన్న ఆందోళనతో గంటల తరబడి అక్కడే నిరీక్షించారు. టీటీడీ వారిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఎంతమంది వచ్చారనే అంచనా కూడా వేయలేదు. ఆహారం, తాగు నీటి పంపిణీ గురించి పట్టించుకోలేదు. పోలీసు అధికారులు పత్తా లేకుండా పోయారు. ఉన్న కొద్ది మంది భక్తులతో అత్యంత దురుసుగా ప్రవర్తించారు. లక్షలాది మంది భక్తులు గంటల తరబడి రోడ్ల మీద నిరీక్షించిన తరువాత.. తాపీగా బుధవారం రాత్రి 8 గంటల సమయంలో క్యూలైన్లలోకి అనుమతిస్తామని ప్రకటించి గేట్లు తెరిచారు. అప్పటికే గంటల తరబడి నిరీక్షించిన భక్తులు ఒక్కసారిగా క్యూ లైన్లలోకి ప్రవేశించడంతో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఉపద్రవాన్ని గుర్తించిన తరువాత కూడా టీటీడీ, పోలీసు అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించ లేదు. అసలు అక్కడ తగినంత మంది పోలీసు, టీటీడీ విజిలెన్స్ అధికారులు, సిబ్బంది అందుబాటులో లేరు. టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో (తిరుమల) వెంకయ్య చౌదరి నుంచి తక్షణ స్పందన కొరవడి విషాదం చోటు చేసుకుంది.తిరుపతిలో టికెట్ల జారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయమే ఇంతటి పెను విషాదానికి ప్రధాన కారణం. లక్ష మందికిపైగా భక్తులు వచ్చినా టికెట్ల జారీ కోసం పటిష్ట క్యూలైన్లు, ఇతర వ్యవస్థలు తిరుమలలో మాత్రమే ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆ విషయాన్ని పట్టించుకోకుండా తిరుపతిలోనే టికెట్లు జారీ చేస్తామని ప్రకటించాయి. వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఉన్నవారినే తిరుమల వెళ్లేందుకు అలిపిరి వద్ద అనుమతిస్తామని ప్రభుత్వం, టీటీడీ ప్రకటించాయి. తిరుపతిలోని కౌంటర్లలో టోకెన్లు పొందితే కానీ అలిపిరి దాటి వెళ్లలేరు. దాంతో వివిధ ప్రాంతాల నుంచి భారీగా వచ్చిన భక్తులు తిరుపతిలోనే గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం ఎంతమంది భక్తులు వస్తారనే అంశాన్ని ప్రభుత్వం, టీటీడీ కనీసం అంచనా వేయలేదు. పది రోజులపాటు దర్శనం ఏర్పాటు చేశామని చెబుతూ అతి ధీమాతో కళ్లు మూసుకుపోయి వ్యవహరించాయి. ఎన్ని రోజులు ఉత్తర ద్వార దర్శనం కల్పించినా వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారి దర్శనానికే లక్షలాది భక్తులు మొదటి ప్రాధాన్యమిస్తారనే విషయాన్ని పట్టించుకోలేదు.బాబు విధేయుడు బదిలీతో సరిసాక్షి, అమరావతి: తిరుపతిలో చోటు చేసుకున్న విషాదానికి బాధ్యుడైన తన అస్మదీయ అధికారిని కాపాడేందుకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యమివ్వడం విభ్రాంతి కలిగిస్తోంది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ఓ డీఎస్పీ, గోశాల డైరెక్టర్‌ను సస్పెండ్ చేశారు. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, తిరుపతి జేఈవో గౌతమిని బదిలీ చేశారు. ఆశ్చర్యకరమేమిటంటే.. భక్తుల భద్రతకు ఎస్పీ ప్రధాన బాధ్యత వహించాలి. కానీ ఎస్పీ సుబ్బారాయుడు చంద్రబాబుకు వీర విధేయుడు. తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఆయన్ను వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధించేందుకే డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తెచ్చి తిరుపతి ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగానే కొద్ది నెలలుగా ఆయన అక్రమ కేసులతో అరాచకానికి పాల్పడుతున్నారు. ఆరుగురు భక్తుల దుర్మరణానికి ప్రధాన బాధ్యుడు అయినప్పటికీ సుబ్బారాయుడిని సస్పెండ్ చేయకుండా బదిలీతో సరిపెట్టారు. కొద్ది రోజుల్లో ఆయనకు మరో ప్రధాన పోస్టింగు ఇవ్వాలనే ఉద్దేశంలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. -
దేవదేవా.. ఏమిటీ విషాదం!
వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వారం గుండా వెళ్లి దేవదేవుని దర్శనం చేసుకుంటే జీవిత కాలం ఆ తదాత్మ్యంలో, భగవంతుడు మోక్ష ప్రాప్తి కలిగిస్తాడన్న ఆనందంలో గడిపేయొచ్చు. ఇదే విశ్వాసంతో లక్షలాది భక్తులు వైకుంఠ ఏకాదశికి తిరుమలేశుని దర్శించుకోవాలని తలంచారు. కానీ, ప్రభుత్వం, టీటీడీ నిర్లక్ష్య ధోరణి వల్ల దేవదేవుని దర్శనం కాకుండానే, ఆ ఆనందాన్ని పొందకుండానే ఆరుగురు ప్రాణాలొదిలారు. దేవుడిని దర్శించుకొని వస్తామని ఇంటి నుండి వెళ్లిన వారు విగతజీవులై వస్తున్నారన్న వార్త వారి కుటుంబాలకు శరాఘాతంలా తగిలింది. ఓ కుటుంబంలో పిల్లలకు తల్లి దూరమైంది. మరో కుటుంబంలో లక్ష్మీ కళ తప్పింది. మరో ఇంట్లో కుమారుడి క్షేమం కోసం నిత్యం పూజలు చేసే తల్లే దూరమైంది. ఇంకొక ఇంటి పెద్ద కానరాని దూరాలకు వెళ్లిపోయిడు.. – సీతంపేట, మద్దిలపాలెం, కంచరపాలెం (విశాఖపట్నం), నర్సీపట్నంఅమ్మ చనిపోయిందని పిల్లలకు ఎలా చెప్పాలి?‘తిరుపతి వేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార దర్శనం ఒక్కసారైనా చేసుకుంటానని అనడంతో కాదనలేకపోయాను. కానీ, ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతుందని కలలో కూడా ఊహించలేదు. మా అక్క, మరో ముగ్గురు బంధువులతో కలిసి ఈ నెల 5న తిరుపతికి బయల్దేరింది. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో క్యూలో ఉండగా ఫోన్ చేసింది. భోజనం చేశారా? పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగింది. ఫోన్లో గోలగా వినిపించడంతో, జనాలు ఎక్కువగా ఉన్నట్టున్నారు జాగ్రత్తగా ఉండు అని చెప్పాను. మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పింది. మళ్లీ ఫోన్ చేయలేదు. గంట తర్వాత ఫోన్ చేస్తే కలవలేదు. రాత్రి 11 గంటల సమయంలో మా అక్క ఫోన్ చేసి తొక్కిసలాటలో అందరం తలో దిక్కు అయిపోయామని, అందరం కలిశాం.. కానీ లావణ్య కనిపించడంలేదని చెప్పింది. ఆస్పత్రికి వెళ్లి చూడగా లావణ్య చనిపోయి ఉందని రాత్రి 12.30 సమయంలో నాకు ఫోన్ చేసి చెప్పారు. దర్శనానికి వెళ్లిన అమ్మ తిరిగి వస్తుందని నా పిల్లలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. తల్లిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేని పిల్లలకు మీ అమ్మ చనిపోయిందని, దేవుడి దగ్గరికి వెళ్లిపోయిందని నా నోటితో ఎలా చెప్పను’ అంటూ లావణ్య భర్త సతీష్ కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే విశాఖపట్నం వెంకటేశ్వర కాలనీ ప్రజలహృదయాలు బరువెక్కాయి. విశాఖలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన సూరిశెట్టి లావణ్య తన ఆడపడుచు, మరో ముగ్గురు మహిళలతో కలిసి వైకుంఠ ద్వార దర్శనం కోసం ఈ నెల 5న తిరుమల వెళ్లారు. టోకెన్ల కోసం క్యూలో ఉండగా జరిగిన తొక్కిసలాటలో లావణ్య ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త సతీష్ సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద పాప శ్రీలాస్య 9వ తరగతి, చిన్న పాప కీర్తి 6వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ తల్లి లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. తల్లి మరణవార్తను పిల్లలకు ఎలా చెప్పాలో తెలియక సతీష్ వారిని బాజీ జంక్షన్‌లోని తన అక్క ఇంటికి పంపించేశాడు.‘శాంతి’ దూరమై విలపిస్తున్న కుటుంబంవిశాఖపట్నం కంచరపాలెం సమీపంలోని గాంధీనగర్‌లో కండిపిల్లి శాంతి కుటుంబం వేంకటేశ్వర స్వామి భక్తులు. ఆమె భర్త వెంకటేష్ ఆటో డ్రైవర్. కుమారుడు మహేంద్ర వరప్రసాద్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముగ్గురూ గోవింద మాల దీక్ష చేపట్టారు. తొమ్మిది రోజుల పాటు గోవింద నామస్మరణతో కఠిన నియమాలు పాటిస్తూ దీక్ష చేశారు. 11వ రోజున దీక్ష విరమణ కోసం ఆ కుటుంబం తిరుపతికి వెళ్లింది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో శాంతి దుర్మరణం పాలయ్యారు. తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి వెంకటేష్, వరప్రసాద్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పి కన్నీరుమున్నీరయ్యారు. దీంతో ఇందిరానగర్‌లోని శాంతి తల్లి, అన్నదమ్ములు, బంధువులు, గాంధీనగర్‌లోని అత్తమామలు విషాదంలో కూరుకుపోయారు. శాంతి అందరితో మంచిగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, తిరుమల వెళ్లాలంటేనే భయంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ముందు ఉన్న అమ్మ చనిపోయింది‘టోకెన్ల కోసం క్యూలో ఉండగా గేట్లు ఒక్కసారిగా తెరవడంతో తొక్కిసలాట జరిగింది. నేను, నాన్న వెనుక ఉన్నాం. ముందు ఉన్న అమ్మ తొక్కిసలాటలో మిగతావారి కాళ్ల కింద నలిగిపోయింది’ అని ఆమె కుమారుడు కండిపిల్లి వరప్రసాద్ రోదిస్తూ జరిగిన సంఘటనను వివరించాడు.నా కూతురిని పొట్టన పెట్టుకున్నారుతిరుపతి దర్శనానికి వెళ్లిన నా కూతురు శాంతిని ప్రభుత్వమే పొట్టన పెట్టుకుంది. వైకుంఠ ఏకాదశికి లచ్చల్లో భక్తులు వస్తారని తెలిసినా, దేవస్థానం అధికారులు, ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా భక్తుల మరణానికి కారణమయ్యారు. నా కడుపు కోత నాయకులకు శాపంగా మారాలి. – కిల్లాడి అప్పలనరసమ్మ, శాంతి తల్లిమా కుటుంబాన్ని బాగా నడిపించేది మా కోడలు శాంతి మరణవార్త వినగానే మా ప్రాణాలు పోయినట్టు అయ్యింది. ఆమె అందరినీ కలుపుకొంటూ కుటుంబాన్ని నడిపేది. గ్రామంలో, చుట్టుపక్కల ఇళ్లలో, బంధువులతో కలుపుగోలుగా ఉండేది. మమ్మల్ని బాగా చూసుకునేది. – కండిపిల్లి అప్పారావు, శాంతి మామయ్యకుమారుడి ఉన్నతి కోసం పరితపించి..విశాఖపట్నం మద్దిలపాలెం రామాలయం సమీపంలో నివసించే ఆటో డ్రైవర్ గుడ్ల లక్ష్మారెడ్డి, రజనీ (47) దంపతులకు ఒక్కడే కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి. ఎంతో కష్టపడి అతన్ని బాగా చదివించారు. రెండేళ్ల క్రితం ఎంఎస్ చదువు కోసం అమెరికా పంపించారు. ఇందుకోసం ఇంట్లో సగభాగాన్ని విక్రయించారు. కుమారుడి భవిష్యత్తు బాగుండాలని రజని నిత్యం శ్రీ వేంకటేశ్వర స్వామికి పూజలు చేసేదని సమీప బంధువులు తెలిపారు. ప్రతి శనివారం ఆమె స్వామిని ప్రత్యేకంగా ఆరాధించేది. కుమారుడికి మంచి ఉద్యోగం రావాలని కోరుకునేది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిత్యం ఆరాధించే వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి లక్ష్మారెడ్డి దంపతులు, బంధువులు పది మంది తిరుపతి వెళ్లారు. వారంతా ఉత్తర ద్వార దర్శనం టోకెన్ల కోసం క్యూలో నిలబడ్డారు. ఆ సమయంలో జరిగిన తోపులాటలో రజనీ ప్రాణాలు కోల్పోయింది. కుమారుడి చదువు పూర్తయి, ఉద్యోగం వచ్చే సమయంలోనే రజని మరణించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పైసా పైసా కూడబెట్టి తనను అమెరికా పంపిన తల్లి ఇక లేదన్న వార్త విని హర్షవర్ధన్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. అతను శుక్రవారం అమెరికా నుంచి విశాఖపట్నం చేరుకుంటాడని రజని బంధువులు తెలిపారు.ఆ ఇల్లే దేవాలయం గుడ్ల రజని పరమ భక్తురాలు. నిత్యం భగవత్ ఆరాధనలో గడిపేది. ఆమె ఇంట్లో ఎక్కడ చూసినా దేవుని చిత్రపటాలే కనిపిస్తాయి. ఆమె ఇల్లే ఓ దేవాలయం. కుమారుడి భవిష్యత్తు కోసం వేంకటేశ్వరస్వామికి నిత్యం పూజలు చేసేది. సాయిబాబాని ఆరాధించేది. అంతటి భక్తురాలు ఇలా అర్ధంతరంగా మరణించడంతో మేమందరం జీర్ణించుకోలేకపోతున్నాం. – ఎం.లక్ష్మి, మద్దిలపాలెంవెళ్లిపోయిన పెద్ద దిక్కు..తిరుపతి తొక్కిసలాట మృతుల్లో ఒకరైన బొడ్డేటి నాయుడుబాబు నర్సీపట్నం పట్టణంలోని పెదబొడ్డేపల్లి నివాసి. బోరుబావుల నిర్మాణ కార్మికుడు. భార్య మణికుమారి, కుమార్తె సునీత ఉన్నారు. ఈ నెల 6న నాయుడుబాబు, మణికుమారి, నర్సీపట్నం మండలం చెట్టుపల్లికి చెందిన కుటుంబ స్నేహితులైన కరణం సత్యనారాయణ, అతని భార్య సంతోషి కలిసి తిరుపతి వైకుంఠ దర్శనానికి వెళ్ళారు. క్యూలో జరిగిన తొక్కిసలాటలో భార్య, భర్త తలోదారి అయ్యారు. మణికుమారిని పోలీసులు రక్షించారు. నాయుడుబాబు మరణించారు. ఆయన ఫోన్ నుంచే పోలీసులు మణికుమారికి ఈ విషయం చెప్పారు.ఏటా తిరిగి వచ్చే నాన్న ఈసారి రాలేదునాన్నకు వేంకటేశ్వరస్వామి అంటే ఎనలేని భక్తి. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి దర్శనానికి వెళ్తుంటాడు. అప్పుడు కాకుండా మరో మూడు నాలుగుసార్లు దర్శనానికి వెళ్తాడు. ఈ సారి రద్దీ దృష్ట్యా వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్లవద్దని చెప్పాం. ఏటా దర్శనం చేసుకొని ఆనందంగా తిరిగి వచ్చే నాన్న ఈసారి రాలేదు. మాకు నాన్నే పెద్ద దిక్కు. మా కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలి’ అంటూ కుమార్తె సునీత రోదిస్తోంది. – సునీత, నాయుడుబాబు కుమార్తె నా కుడి భుజం పోయింది...నా కుడి భుజం పోయింది. నాకు అన్ని విషయాల్లో నా సోదరుడు అండగా ఉండేవాడు. స్వామి సన్నిధిలో ఇలా జరగటం బాధాకరం. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయాం. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. – బి.వి.రమణ, నాయుడుబాబు సోదరుడు -
ఆస్పత్రుల్లో హాహాకారాలు
తిరుపతి కల్చరల్/తిరుపతి అర్బన్: తిరుపతి రుయా ఆస్పత్రి, స్విమ్స్ ఆస్పత్రి మృతుల బంధువుల రోదనలు, క్షతగాత్రుల హాహాకారాలు మిన్నంటాయి. వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్ల కౌంటర్ల వద్ద తోపులాటల కారణంగా ఆరుగురు భక్తులు చనిపోయినట్టు అధికారులు ధ్రువీకరించారు. వారిలో నలుగురు రుయా ఆస్పత్రిలోను, మరో ఇద్దరు స్విమ్స్ ఆస్పత్రిలోను మరణించారని చెప్పారు. తమిళనాడులోని సేలం జిల్లా మేచారి గ్రామానికి చెందిన 10 మంది భక్తులు విష్ణునివాసం వద్దకు చేరుకున్నారు. ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తోపులాట చోటుచేసుకుంది. జనాల మధ్య ఇరుక్కుపోయిన కృష్ణన్ భార్య ఆర్.మల్లిగ (50) ఊపిరాడక మృతి చెందింది. మల్లిగ కాలు విరిగి, తీవ్ర అస్వస్థతకు గురవడంతో కాపాడాలని ఆమె భర్త పోలీసులను వేడుకున్నారు. వారు స్పందించకపోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆటోలో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్సకు రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో వెంటనే అదే ఆటోలో రుయాకు బయలుదేరగా ఆమె మార్గంమధ్యలో మృతి చెందారు. తన భార్య దుస్థితిని పోలీసులకు చెప్పినా కనీసం స్పందించకపోవడంపై ఆమె భర్త కృష్ణన్ కన్నీటి పర్యంతమయ్యారు. కాగా.. వైకుంఠ దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి ఇంతమంది చనిపోవడం బాధాకరమని కలెక్టర్ వెంకటేశ్వర్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఆరుగురు మరణించారని, 40 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించామని, దుర్ఘటనలో మృతి చెందిన, గాయపడిన వారి కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ప్రకటించారు.కాలి నడకన వచ్చి..అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం నరసాపురం గ్రామానికి చెందిన 360 మంది భక్తులు గోవిందమాల వేసుకుని వైకుంఠ ఏకాదశి నాడు వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి విచ్చేశారు. నాలుగు రోజుల కిందట గ్రామం నుంచి కాలినడకన బయలుదేరిన వారంతా 135 కిలోమీటర్లు నడుచుకుంటూ బుధవారం సాయంత్రం 6 గంటలకు తిరుపతి చేరుకున్నారు. బైరాగిపట్టెడిలోని రామానాయుడు స్కూల్లో టీటీడీ ఏర్పాటు చేసిన కౌంటర్లో టోకెన్లు తీసుకోవడానికి వెళ్లారు. అయితే ఒక్కసారిగా పోలీసులు వదిలిపెట్టడంతో 38 మంది కుప్పకూలి పడిపోయారు. దీంతో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారంతా రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పలువురికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. దీంతో వారి బంధువులు రామానాయుడు స్కూళ్ల వద్ద పద్మావతి పార్క్‌లో రాత్రంతా కూర్చుని రోదిస్తున్నారు. మరికొందరు రుయా, స్విమ్స్ ఆస్పత్రి వద్ద రోదిస్తున్నారు.అన్నమయ్య జిల్లా నరసాపురం గ్రామానికి చెందిన క్షతగాత్రుల్లో తీవ్రంగా గాయపడినవారు : నరసమ్మ, గణేష్, లక్ష్మిదేవి, గంగిరెడ్డి, మణిరెడ్డి, తిమ్మక్క, వసంతమ్మసర్కారు నిర్లక్ష్యంతోనే ప్రమాదంసర్కారు నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగింది. ముక్కోటి ఏకాదశి నాడు పెద్దఎత్తున భక్తులు వస్తారని తెలిసినా.. పటిష్టమైన చర్యలు చేపట్టలేదు. ప్రమాదం జరిగిన తర్వాత అంబులెన్స్‌లు, పోలీసులతో హంగామా చేస్తున్నారు. కాళ్లు, చేతులు విరిగిపోయి అనేక మంది వికలాంగులయ్యారు. ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. అందరినీ ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే న్యాయం కోసం పోరాటం చేస్తాం. – సీబీ రమణ, నరసాపురం, అన్నమయ్య జిల్లాప్రణాళిక లేకపోవడం వల్లే ప్రమాదంటీటీడీకి ప్రణాళిక లేకపోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకుంది. వచ్చిన వాళ్లను వచ్చినట్టు క్యూలైన్లో వదలకుండా పెద్దఎత్తున జనం గుమికూడిన తర్వాత వదిలిపెట్టడం దారుణం. దీంతో ప్రమాదం జరిగింది. టీటీడీ నిర్లక్ష్యంతోనే ఈ ఘోరం చోటుచేసుకుంది. ఎప్పుడూ ఇలా జరగలేదు. ఎన్నోసార్లు వచ్చి దర్శనం చేసుకున్నాం. ఇలా జరగడం ఇదే ప్రథమం. టీడీపీ నైతిక బాధ్యత వహించి అందరినీ ఆదుకోవాల్సి ఉంది. – సీపీ మునివెంకయ్య, నరసాపురం, అన్నమయ్య జిల్లాపోలీసుల బాధ్యతారాహిత్యం వల్లే..పోలీసుల బాధ్యతారాహిత్యం కారణంగానే ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భక్తులను వదిలిపెట్టడంతో పెద్దప్రమాదం చోటుచేసుకుంది. మా గ్రామం నుంచే 360 మంది వచ్చాం. ఎవరు ఎక్కడ పడిపోయారో తెలియడం లేదు. భక్తుల సంఖ్యకు సరిపడా విధంగా పోలీసులు భద్రత కల్పించలేదు. అందువల్లే ప్రమాదం జరిగింది. తొక్కిసలాట జరుగుతున్నా.. పోలీసులు అడ్డుకట్ట వేయలేకపోయారు. – జే.వెంకట రమణ, నరసాపురం గ్రామం, అన్నమయ్య జిల్లాఎప్పుడూ జరగలేదుఇలాంటి దారుణం ఎప్పుడు జరగలేదు. గత ప్రభుత్వంలో కూడా పెద్దఎత్తున టోకెన్లు ఇచ్చారు. అయితే ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. తోపులాటలకు తావులేకుండా చర్యలు చేపట్టారు. కానీ.. ఈసారి రామానాయుడు స్కూల్ వద్దకు అత్యధికంగా భక్తులు వచ్చారు. వారిని సర్దుబాటు చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం దారుణం. ఎంతో భక్తిభావంతో 140 కిలోమీటర్లు నడుచుకుంటా తిరుపతి వచ్చాం. కనీస ఏర్పాట్లు చేపట్టకపోవడంతోనే ఈ ఘోరం జరిగింది. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోండి. – పి.అంజప్ప, నరసాపురం, అన్నమయ్య జిల్లాచాలా దారుణంభక్తుల ప్రాణాలతో టీటీడీ అధికారులు ఆటలాడుకున్నారు. దూరప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చాం. ఇక్కడ కనీస ఏర్పాట్లు చేయలేదు. క్యూ నిర్వహణ అస్సలు బాగాలేదు. ఎలా పడితే అలా తోసేశారు. భోజనం లేదు. తాగునీరు లేదు. చిన్నపిల్లలతో వచ్చిన వారి పరిస్థితి వర్ణనాతీతం. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా అందరినీ ఒకే క్యూలోకి నెట్టేశారు. పోలీసులు అత్యుత్సాహంతోనే ఇబ్బందులు వచ్చాయి. భక్తులతో వారు వ్యవహరించిన తీరు చాలా దారుణం. – లక్ష్మి, భక్తురాలు, విశాఖపట్నంబాధ్యత ఎవరు వహిస్తారుఅధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇంతమంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ తొక్కిసలాటకు ఎవరిది బాధ్యత. ఇన్ని కుటుంబాల్లో విషాదం నిండేందుకు ఎవరు కారణం. ఎంతో ఆశగా శ్రీవారి దర్శనానికి వస్తే ఇలాంటి ఘటన జరగడం బాధాకరం. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసీ ఇంత అన్యాయంగా ఏర్పాట్లు చేస్తారా. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలి. బాధ్యులను కఠినంగా శిక్షించాలి. – కందన్, భక్తుడు, తిరువణ్ణామలై, తమిళనాడు ఘోరానికి కారకుల్ని వదిలిపెట్టకూడదుఇంత దారుణమైన ఘటనను ఇప్పటివరకు చూడలేదు. శ్రీవారిని దర్శించుకుందామని వస్తే భక్తుల ప్రాణాలతోనే టీటీడీ అధికారులు ఆడుకున్నారు. కళ్ల ముందే మనుషులు కూలిపోతుంటే చూడలేకపోయాం. పోలీసులు మాత్రం అందరినీ తోసేసి వేడుక చూశారు. ఆస్పత్రికి కూడా సకాలంలో తీసుకెళ్లలేదు. ఇంకా ఎంతమంది చనిపోతారో ఆలోచిస్తేనే తట్టుకోలేకపోతున్నాం. ఇంతటి ఘోరానికి కారణమైన వారిని వదలిపెట్టకూడదు. – వైతీశ్వరి, భక్తురాలు, తిరుచ్చి, తమిళనాడుఅడుగడుగునా నిర్లక్ష్యం» వచ్చిన వారిని వచ్చినట్లు క్యూలైన్లోకి అనుమతించాల్సిందన్న భక్తులు »ఒకేసారి అన్నిచోట్లా గేట్లు తెరవడంతోనే ఉపద్రవం తిరుపతి తుడా : వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీచేసే కేంద్రాల వద్ద అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించింది. లక్షా యాభైవేల టోకెన్లు జారీచేస్తామని చెప్పి.. కనీస రక్షణ చర్యలు, మౌలిక ఏర్పాట్లుచేయడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. వచ్చిన వారిని వచ్చినట్లు క్యూలైన్లోకి అనుమతించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని భక్తులు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా ఒకేసారి అన్నిచోట్లా గేట్లు తెరవడంతో అప్పటికే గంటల తరబడి వేచి ఉన్న వేలాది మంది భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో ఊహించని విధంగా తొక్కిసలాట జరిగింది. దీంతో వీరిని అదుపుచేయడం అటు పోలీసులకు, ఇటు టీటీడీ సిబ్బందికి సవాలుగా మారింది. మరోవైపు.. ఈ తొక్కిసలాటలో చిక్కుకున్న క్షతగాత్రులను తరలించడంలో భద్రతా సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారని భక్తులు మండిపడ్డారు. మరోవైపు.. శ్రీనివాసం, రామానాయుడు స్కూల్ ప్రాంతాల్లోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. ఆదుకోని అంబులెన్స్‌లు.. ఇక గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో కూడా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. సకాలంలో అంబులెన్స్‌లు రాలేదు. కొన్నిచోట్ల వచ్చినా.. సరైన సమయంలో స్పందించలేదని బాధితులు వాపోయారు. అలాగే, అవసరమైన మేర అంబులెన్స్‌లను రప్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.ఇక గాయపడిన వారిని గుర్తించి ఆస్పత్రికి తరలించడం ఆలస్యం కావడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సకాలంలో సహాయక చర్యలు చేపట్టకపోవడం.. క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి తరలించకపోవడం కూడా మృతుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమని భక్తులు ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యం.. టోకెన్ల జారీ కేంద్రం వద్ద పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తొక్కిసలాటలో ఒక అమ్మాయి కళ్లు తిరిగి పడిపోయింది. ఆ తర్వాత నేనూ పడిపోయాను. నన్ను ఒక అమ్మాయి తీసుకెళ్లింది. ఆ సమయంలో పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదు. తొక్కిసలాటలో గాయపడ్డ వారిని అందరినీ త్వరగా ఆస్పత్రికి చేర్చలేదు. అంబులెన్సులు కూడా వెంటనే రాలేదు. ఆ తర్వాత చాలామందిని ఒకేసారి తీసుకొచ్చి స్విమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. – ఆస్పత్రి వద్ద ఓ బాధితురాలు -
చింతించడం తప్ప చేసేదేమీ లేదు
తిరుమల: తిరుపతిలోని బైరాగిపట్టెడలో టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందిన ఘటనపై చింతించడం తప్ప చేసేదేమీ లేదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘పొరపాటు జరిగిపోయింది. చింతించడం తప్ప మనం చేసేదేమీ లేదు’ అన్నారు. అధికారుల వైఫల్యంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. ఒక సెంటర్లో భక్తురాలు అపస్మారక స్థితికి చేరుకుంటుండగా డీఎస్పీ గేట్లు తీయడంతో ఒక్కసారిగా భక్తులు ప్రవేశించారని.. దీంతో తొక్కిసలాట జరిగి భక్తులు మృతిచెందినట్టు ప్రాథమికంగా సమాచారం అందిందని తెలిపారు. మరో 20, 25 మంది వరకు క్షతగాత్రులు రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. సీఎం అసహనం వ్యక్తం చేశారు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు తనతోను, టీటీడీ అధికారులతోను మాట్లాడారని బీఆర్ నాయుడు తెలిపారు. ఘటనపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు చెప్పారు. అధికారుల వైఫల్యంతోనే ఇటువంటి ఘటన చోటుచేసుకుందని, అధికారులు చాలా ఈజీగా తీసుకున్నారని సీఎం పేర్కొన్నారన్నారు. సీఎంవో, డీజీపీ కార్యాలయాలు సైతం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాయని వెల్లడించారు. పరిస్థితిని ఈవో శ్యామలరావు, కలెక్టర్ వెంకటేశ్వర్ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఇందులో ఎటువంటి కుట్ర లేదని.. ప్రమాదవశాత్తు మాత్రమే దుర్ఘటన చోటుచేసుకుందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించామన్నారు. మృతుల కుటుంబాలను, గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు గురువారం తిరుపతి వస్తున్నట్టు చెప్పారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తారని పేర్కొన్నారు. -
9 నుంచి వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్లు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి జనవరి 9న ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు ఇస్తామని, తదుపరి రోజులకు ఏరోజుకారోజు ముందురోజు టోకెన్లు జారీచేస్తామని ఈవో తెలిపారు.ఇందుకోసం తిరుపతి, తిరుమలలో కౌంటర్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని, టోకెన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫొటో గుర్తింపుతో కూడిన స్లిప్‌లను జారీచేస్తామని తెలిపారు.టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజుల్లో శ్రీవారి దర్శనం ఉండదని స్పష్టం చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల కేంద్రాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో గౌతమి, జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, సీవీఎస్వో శ్రీధర్‌తో కలిసి ఈవో తనిఖీ చేశారు. -
శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపు సర్వదర్శనం టోకెన్ల రద్దు..
తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపడుతోంది. ఈ సందర్భంగా డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి, 24న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. డిసెంబరు 22న అదేరోజు శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుపతిలో మంజూరు చేసే సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. భక్తులు తిరుమలలో వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా సర్వదర్శనంలో ఆరోజు శ్రీవారిని దర్శించుకోవచ్చు. డిసెంబరు 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ ప్రారంభమవుతుంది. టోకెన్లు పూర్తయ్యే వరకు నిరంతరాయంగా టోకెన్ల జారీ జరుగుతుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరడమైనది. కార్యక్రమాల వివరాలు డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 10 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా తిరుమల నాదనీరాజనం వేదికపై మధ్యాహ్నం 12 గంటల నుండి భగవద్గీతలోని 18 ఆధ్యాయాల్లో గల 700 శ్లోకాలతో సంపూర్ణ భగవద్గీత అఖండ పారాయణం చేస్తారు. సాయంత్రం 6 గంటల నుండి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహిస్తారు. డిసెంబరు 24న వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకుని తెల్లవారుజామున 4.30 నుండి 5.30 గంటల వరకు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవం వైభవంగా జరుగనుంది. ఈరోజును స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి అని కూడా పిలుస్తారు. ఆర్జిత సేవలు రద్దు ► ఈ పర్వదినాల నేపథ్యంలో డిసెంబరు 22 నుండి 24వ తేదీ వరకు, డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. సహస్ర దీపాలంకార సేవను ఏకాంతంగా నిర్వహిస్తారు. ► ఈ పది రోజుల పాటు ఇతర ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. ► గతంలో లాగనే ఈ సంవత్సరం కూడా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు, కుటుంబ సభ్యులకు పరిమిత సంఖ్యలో మాత్రమే బ్రేక్ దర్శనం ఇవ్వబడుతుంది. 10 రోజుల పాటు సిఫారసు లేఖలు స్వీకరించబడవు. -
డిసెంబరు 22 నుండి వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి డిసెంబరు 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుపతిలోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 90 కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు మంజూరు చేస్తామని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి తెలిపారు. కౌంటర్లను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జడ్పి హైస్కూల్లో కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కౌంటర్లలో 4 లక్షలకు పైగా సర్వదర్శనం టోకెన్ల కోటా పూర్తయ్యేవరకు మంజూరు చేస్తామని వెల్లడించారు. కౌంటర్ల వద్ద ప్రత్యేకంగా క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటు చేశామని, వేచి ఉండే భక్తులకు తాగునీరు, అల్పాహారం, టీ, కాఫీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులను 24 గంటలు ముందు మాత్రమే తిరుమలకు అనుమతిస్తామన్నారు. దర్శన టోకెన్లు ఉన్నవారిని మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లవచ్చు గానీ దర్శనానికి అనుమతించబడరని, ఈ విషయాలను కౌంటర్ల వద్ద అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పారు. తిరుపతిలోని అన్ని కౌంటర్ల వద్ద క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తామని, త్వద్వారా భక్తులు ఇతర ప్రాంతాల్లోని కౌంటర్లకు సులువుగా చేరుకోవడానికి వీలు కలుగుతుందని చెప్పారు. సర్వదర్శనం టోకెన్ల సమాచారం తెలుసుకుని ప్రణాళిక ప్రకారం తిరుమలకు వచ్చి స్వామివారి అనుగ్రహానికి పాత్రులుకావాలని కోరారు. జేఈవో వెంట ఎస్ఈలు శ్రీ సత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర్లు, డెప్యూటీ ఈవోలు శ్రీ గోవిందరాజన్, శ్రీ సుబ్రమణ్యం, ఐటి జిఎం శ్రీ సందీప్, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్‌కుమార్, ఎవిఎస్వో శ్రీ నారాయణ తదితరులు ఉన్నారు. -
తిరుమల: ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్ల జారీ
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి భక్తులకు నేటి నుంచి ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభమైంది. కోవిడ్- 19 మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడానికి నిలిపి వేసిన ఆఫ్ లైన్ టికెట్ల జారీ ప్రక్రియను నేటి నుంచి కొనసాగించనున్నారు. ఫిబ్రవరి 16న (బుధవారం) దర్శనం కోసం ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీగోవింద రాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా టీటీడీ టోకెన్లను జారీ చేస్తోంది. తెల్లవారుజామున నుంచే టికెట్ల కోసం భక్తులు బారులు తీరారు. చదవండి: (పార్టీ కార్యకర్త వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్) -
శ్రీనివాసం కాంప్లెక్స్‌లో టోకెన్లు జారీ చేస్తున్న టీటీడీ
-
శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ
-
సర్వదర్శనం టోకెన్ల జారీపై కీలక ప్రకటన చేసిన టీటీడీ చైర్మన్
-
నేరుగా అమ్మ దర్శనానికే..!
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): అమ్మవారి దర్శనానికి ఆన్లైన్, కంప్యూటర్ టోకెన్ల విధానాన్ని దుర్గగుడి ఈవో భ్రమరాంబ శుక్రవారం రద్దు చేశారు. దుర్గగుడి ఈవోగా బాధ్యతలు చేపట్టిన భ్రమరాంబ గురువారం రాత్రి భక్తులకు టికెట్లు జారీ చేస్తున్న టోకెన్ల విధానాన్ని పరిశీలించారు. ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులు ఉచిత దర్శనం కోసం నేరుగా క్యూలైన్లోకి ప్రవేశించి అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రూ.300, రూ.100 టికెట్లను క్యూలైన్ల వద్దే జారీ చేసే ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. శుక్రవారం మధ్యాహ్నం దేవస్థాన ఆవరణలో దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడుని ఈవో భ్రమరాంబ మర్యాద పూర్వకంగా కలిసి ఉగాది, చైత్రమాస బ్రహ్మోత్సవాల వేడుకల నిర్వహణ, అభివృద్ధి పనుల గురించి చర్చించారు. చదవండి: ఆంధ్రజ్యోతి ప్రెస్‌కు ఐలా నోటీసులు చంద్రబాబు, నారా లోకేశ్‌పై డీజీపీకి ఫిర్యాదు -
శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత
సాక్షి, తిరుమల: దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం సర్వదర్శనం టైంస్లాట్ (ఎస్ఎస్డీ) టోకెన్ల జారీని ఈ నెల 12 నుంచి నిలిపివేస్తున్నట్లు టీటీడీ బుధవారం తెలిపింది. ఆదివారం (11–04–2021) సాయంత్రం వరకు మాత్రమే టోకెన్లు జారీ చేయనున్నట్లు పేర్కొంది. కరోనా కేసులు ఉధృతమవుతున్న క్రమంలో మహారాష్ట్రలోని షిర్డీ ఆలయంలో భక్తులకు దర్శనం నిలుపుదల చేసిన విషయం విదితమే. తిరుపతి నగరంలో కూడా కరోనా కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలో సర్వదర్శన టైంస్లాట్ టోకెన్ల కోసం వేల సంఖ్యలో భక్తులు క్యూల్లో వేచి ఉంటున్నారు. దీంతో అక్కడ కరోనా వ్యాప్తి చెందే ప్రమాదమున్న పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. -
పోలీసులు చెప్తే టోకెన్లు ఇస్తారూ.. మేము చెప్తే ఇవ్వరా?
నారాయణపేట: కంది పంటను అమ్మేందుకు కేంద్రానికి వస్తే టోకెన్లు లేవని రైతులను తిప్పిపంపిస్తున్నారని, రైతులు రోడ్డెక్కారని పోలీసులు వస్తే టోకెన్లు ఇస్తున్నారని, మార్కెట్ ప్రతినిధులు, అధికారులు చెబితే ఎందుకివ్వలేదంటూ డీసీఎంఎస్ అధికారులను జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ సురేఖ ప్రశ్నించారు. నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌యార్డులో మార్క్‌ఫెడ్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంది కొనుగోలు కేంద్రంలో టోకెన్లు ఇవ్వడంలేదని మరికల్, ధన్వాడ రైతులు జెడ్పీ వైస్ చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె నేరుగా మార్కెట్‌యార్డుకు చేరుకుంది. మార్కెట్ కార్యాలయానికి కొనుగోలు కేంద్రం నిర్వాహకులను పిలిపించి చర్చించారు. ఇప్పటి వరకు తమ ఇచ్చిన కోటా అయిపోయిందని టోకెన్లు ఇవ్వడం కుదరదని తమ అధికారులతో మాట్లాడి ఇస్తామంటూ డీసీఎంఎస్ అధికారులు ఆమెకు వివరించారు. ఫిబ్రవరి 28వరకు కొనుగోలు చేస్తామని ఆపై గడువు పెరుగుతుందో లేదో తమకు తెలియదని సమాధానమిచ్చారు. డీసీఎంఎస్ అధికారులపై సీరియస్.. ఇప్పటి వరకు రైతులకు ఇచ్చిన టోకెన్ల వరకు కొనుగోలు చేస్తారు సరే. కానీ ధన్వాడ, మరికల్ రైతుల పరిస్థితి ఏంటని డీసీఎంఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఎంతమంది ఆ రోజు వరకు కందులు తీసుకొస్తారో అందరివి కొనాల్సిందేనంటూ పట్టుబట్టారు. అవసరమనుకుంటే ఎమ్మెల్యేతో చెప్పిస్తామని నిర్వాహకులు భరోసానిచ్చారు. ఈ మేరకు గతేడాది ఈ మార్కెట్లో జరిగిన వ్యవహరంతో దాదాపు రూ. 20 లక్షల వరకు నష్టపోవాల్సి వచ్చిందని అందుకే టోకెన్లు ఇచ్చి నిదానంగా కొనుగోలు చేస్తున్నామని, నష్టపోతే ఏవరిస్తారు చెప్పండి అంటూ నిర్వాహకులు ఆవేదన వ్యక్తపరిచారు. రైతులు, నిర్వాహకులమధ్య వాగ్వాదం కొనుగోలు కేంద్రానికి చెరుకున్న డీసీఎంఎస్ అధికారులతో రైతులు వాగ్వివాదానికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న జెడ్పీ వైస్ చైర్పర్సన్ వెంటనే మార్కెట్ కార్యాలయం నుంచి అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. రైతులకు ఇప్పుడు టోకెన్లు ఇస్తే వాళ్లు వెళ్లిపోతారాని లేకపోతే ఇదే పరిస్థితి ఉంటుందని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టోకెన్లు జారీచేయడంతో రైతులు శాంతించారు. -
జనసేన కూడా మొదలెట్టేసింది!
పుంగనూరు (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ జనసేన అభ్యర్థి రామచంద్రయాదవ్ గెలుపొందేందుకు ఓటర్లకు ఎర వేస్తున్నారు. ఒక్కో ఓటరుకు రూ.2 వేలు చొప్పున ఇచ్చేలా టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. టోకెన్లను ఓటర్లకు ఇచ్చి ఒక సెంటర్ పేరు చెబుతున్నారు. అక్కడికి ఈ టోకెన్లను తీసుకుని వెళితే రూ.2 వేల చొప్పున ఇచ్చేలా జనసేన పార్టీ ఏర్పాట్లు చేసింది. ఇలా టోకెన్లను పంపిణీ చేస్తున్న 12 మంది జనసేన కార్యకర్తలను పలు ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు ఆదివారం పట్టుకుని ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పుంగనూరు సమీపంలోని క్రిష్ణమరెడ్డిపల్లె, బోడినాయినిపల్లె పరిసరాల్లో 8 మంది జనసేన కార్యకర్తలు ముద్రించిన రూ.2 వేలు టోకెన్లను ఓటర్లకు పంపిణీ చేస్తుండగా ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారులు శ్రీనివాసరావు, టీమ్ ఆఫీసర్ శివకుమార్ పట్టుకున్నారు. వీరి నుంచి రూ.12 లక్షలు విలువ జేసే 600 టోకెన్లను, రూ.46 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. చౌడేపల్లెలో టోకెన్లు పంపిణీ చేస్తుండగా నలుగురు యువకులను పట్టుకుని 1,600 టోకెన్లను స్వాధీనం చేసుకున్నారు. సింగిరిగుంట చెక్‌పోస్ట్ వద్ద మహేంద్ర స్కార్పియోలో 5,000 టోకెన్లను డ్రైవర్ సీటు క్రింద దాచినట్లు గుర్తించారు. వీటి విలువ రూ.92 లక్షలుగా గుర్తించారు. మొత్తం మీద పుంగనూరు, చౌడేపల్లిలో రూ.1.02 కోట్ల విలువజేసే టోకెన్లను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పుంగనూరులో నాలుగు కేసులు, చౌడేపల్లెలో రెండు కేసులను జనసేన పార్టీపై నమోదు చేశారు. -
కట్టలు తెంచుకున్న ఆగ్రహం
విజయనగరం టౌన్: అగ్రిగోల్డ్ బాధితుల ఆవేశం కట్టలు తెంచుకుంది. జిల్లా నలుమూలల నుంచి ఎంతో వ్యయప్రయాసలకోర్చి జిల్లాకు చేరుకున్న బాధితులు మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచే జిల్లా కోర్టు ప్రాంగణం వద్ద బారులు తీరారు. తీరా టోకెన్లు ఇవ్వడం జరగదనే విషయాన్ని తెలుసుకున్న వారంతా ఒక్కసారిగా కోపోద్రిక్తులై రోడ్డెక్కి నిరసన తెలిపారు. జాతీయ రహదారిని ముట్టడించారు. న్యాయసేవాసదన్ కార్యాలయంపై దాడులు చేసి అద్దాలు ధ్వంసం చేశారు. సంస్ధ చైర్మన్ ఆలపాటి గిరిధర్, సంస్థ కార్యదర్శి లక్ష్మీరాజ్యంలను బాధితులు నిలదీశారు. దీంతో వారు బాధితులకు సర్దిచెప్పి, వెనువెంటనే సాధారణంగా ఇచ్చే టోకెన్ల కౌంటర్లతో పాటూ అదనంగా మరో మూడు కౌంటర్లు ఏర్పాటుచేశారు. మార్చి 11తో ముగియాల్సిన ప్రక్రియ ఈ నెల 22 వరకూ పెంచుతున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. రోడ్డెక్కిన నిరసన వేకువజామున 4 గంటల నుంచి అగ్రిగోల్డ్ బాధితులు జిల్లా న్యాయసేవాసదన్ కార్యాలయం వద్ద బారులు తీరారు. సుమారు ఆరువేల మంది బాధితులు టోకెన్ల కోసం చేరుకున్నారు. అప్పటికే టోకెన్లు ఇవ్వరన్న విషయం తెలుసుకున్న బాధితులు నిరసన గళం వినిపించారు. మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున తమ నిరసన వ్యక్తం చేశారు. కోర్టు ప్రాంగణమంతా బాధితులతోనే నిండిపోయింది. దీంతో కోర్టు కార్యకలాపాలకు తీవ్ర అంతరాయమేర్పడింది. పోలీసుల అదుపులో నలుగురు అగ్రిగోల్డ్ బాధితుల ఆక్రోశానికి టోకెన్ల కౌంటర్ల అద్దాలు పగిలిపోయాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల రంగ ప్రవేశం చేసి, పరిస్థితిని అదుపుచేశారు. అనంతరం జిల్లా న్యాయసేవాసదన్ ప్రతినిధులు టోకెన్ల ప్రక్రియను పోలీసులకు అప్పగించారు. దీంతో బుధవారం నుంచి పోలీసుల సమక్షంలో టోకెన్ల ప్రక్రియ ఉంటుందని తెలిపారు. సరైన ధ్రువపత్రాలు తీసుకురావాలి పోలీసుల అదుపులో టోకెన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో టోకెన్లకు వచ్చే వారు తప్పనిసరిగా అగ్రిగోల్డ్ ఒరిజినల్ బాండ్ పేపర్‌ను చూపించాల్సి ఉంటుంది. అదే విధంగా ఏరోజైతే టోకెన్‌పై వెరిఫికేషన్‌కి ఇచ్చారో ఆ రోజున ఒరిజినల్స్ జెరాక్స్ కాపీలు, రెవెన్యూ స్టాంప్, తదితర వాటిని సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే సహించేది లేదు. ఇప్పటికే ఈ విషయంలో నలుగురిని అదుపులోకి తీసుకున్నాం. మరికొందరిని గుర్తిస్తున్నాం. బాధితులు సంయమనం పాటించాలి.– ఫక్రుద్దీన్, రూరల్ ఎస్ఐ, విజయనగరం -
బ్లాక్‌లో తిరుమల శ్రీవారి సేవా టికెట్ల దందా
-
అన్నం లెక్కల్లో తిరకాసు!
పేదవాడికి కడుపునిండా నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని రాష్ట్రప్రభుత్వం అంటోంది. కేవలం రూ.5 నామమాత్రపు ధరకు అల్పాహారం, భోజనం సరఫరా చేస్తున్నామని, ఇందుకోసం కోట్లాది రూపాయలు సబ్సిడీ భారం మోస్తున్నామని ఆర్భాటం చేస్తోంది. క్యాంటీన్ల నిర్మాణంలోనే పెద్దఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఇప్పటికే వచ్చాయి. కాగా ఇప్పుడు నిర్వాహకులు అధికారులు కూడబలుక్కొని తప్పుడు లెక్కలతో భారీ అవినీతికి తెరలేపుతున్నారనే అనుమానాలు సర్వత్రా రేకెత్తుతున్నాయి. క్యాంటీన్ల నిర్వహణలో పారదర్శకత లోపించడమే ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు. కడప సెవెన్‌రోడ్స్: మూడు రోజు ల క్రితం జిల్లాలోని కడప, ప్రొద్దుటూరులో ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు పెడుతున్నారు. ఒక్కోపూట 500 మంది చొప్పున రోజుకు 1,500 మందికి ఆహారం సరఫరా చేస్తున్నామని కడప మున్సిపల్ కమిషనర్ లవన్న అంటున్నా రు. అయితే క్యాంటీన్లో పనిచేస్తున్న సిబ్బంది మాత్రం పూటకు 300మందికి మాత్రమే ఆహారం సరఫరా చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇలా అధికారులు, సిబ్బంది చెబుతున్న మాటలకు పరస్పరం పొంతన లేకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. సిబ్బంది చెబుతున్న విధంగా పూటకు 300 చొప్పున రోజుకు మూడు పూటల కలిపి 900మందికి టిఫెన్లు, భోజ నాలు సరఫరా చేసి 1,500మందికి సరఫరా చేసినట్లు బిల్లులు చూపి ఆ మేరకు ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసే అవకాశం లేకపోలేదని ప్రజాసంఘాల నేతలు అంటున్నారు. టొకెన్లు కనిపించవ్! ప్రజలు డబ్బు చెల్లించినపుడు ఎలాంటి టోకెన్లు ఇవ్వకపోవడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తోంది. ఇలా డబ్బు తీసుకుని అలా పేపర్ ప్లేట్లు ఇచ్చేస్తున్నారు. ఇందువల్ల ఖచ్చితత్వం లోపిస్తోంది. ఒక వ్యక్తి మూడు పూటలా తింటే క్యాంటీన్ నిర్వాహకులకు రూ.25 ఖర్చు వస్తుందని చెబుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఒక్కో వ్యక్తిపై రూ.60 సబ్సిడీ నిర్వాహకులకు ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఇక ఒక్కో వ్యక్తి మూడు పూటలా చెల్లించే రూ.15లను కలిపితే రూ.75లు వస్తుంది. ఇందులో క్యాంటీన్ నిర్వాహకులకు అయిన రూ.25 ఖర్చును తీసి వేస్తే రూ.50 ఉంటుంది. భోజనం రవాణా, నిర్వహణకు మరో రూ.10 వేసుకున్నా రూ.40 నికరంగా మిగులుతుంది. మూడు పూటలా కలిపి 600 మందిని అధికంగా చూపెడితే రూ.24వేలు మిగులుతుంది. అంటే రోజుకు 900 మందికే ఆహారం సరఫరా చేస్తూ 1,500 మందికి చేశామని దొంగ లెక్కలు రాసుకోవడం ద్వారా రోజుకు రూ.24వేలు నొక్కేస్తున్నారు. ఒక కౌంటర్..భారీగా క్యూ అవకతవకలకు అవకాశం లేకుండా క్యాంటీన్ నిర్వహణ పారదర్శకంగా జరగాలంటే కంప్యూటర్ బిల్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలంటున్నారు. ఇందువల్ల రోజుకు ఎంతమంది క్యాంటీన్లో భోజనం చేస్తున్నారో స్పష్టంగా తెలిసిపోతుంది. క్యాంటీన్‌కు ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు. అయితే ఒక కౌంటర్ మాత్రమే ఉండడంతో చాలాసేపు క్యూలైన్లో వేచి ఉండాల్సి వస్తోంది. కనుక రెండు కౌంటర్లు ఏర్పాటు చేస్తే సౌలభ్యంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాగునీరు లేక అవస్థలు కడప జెడ్పీ ఆవరణంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్లో తాగునీరు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. భోజనం చేస్తున్న సమయంలో గొంతు పట్టుకుంటే అందుబాటులో నీరు లేక ఇబ్బంది పడుతున్నారు. నామమాత్రపు ధరకే భోజనాన్ని అందిస్తున్న ప్రభుత్వం తాగునీటి విషయాన్ని పట్టించుకోకపోవడం సబబు కాదంటున్నారు. క్యాంటీన్ ఆవరణంలో పారిశుద్ధ్యం కూడా లోపించింది. అన్నం ప్లేట్లు ఇష్టానుసారంగా పడేసి ఉండడం కనిపించింది. చేతులు కడుక్కునే నీళ్లే తాగునీరు క్యాంటీన్లో సమస్యల గురించి మున్సిపల్ కమిషనర్ లవన్నను ‘సాక్షి’ వివరణ కోరింది. ఇందుకు ఆయన బదులిస్తూ పూటకు 500 మందికి ఆహారాన్ని సరఫరా చేస్తున్నామన్నారు. క్యాంటీన్లో ప్రజలు చేతులు కడుక్కుంటున్న నీళ్లనే తాగాలన్నారు. పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా డీఈని నియమించామని చెప్పారు. అన్న పేరు చెడగొట్టవద్దు పేదవాడికి తక్కువ ధరకే అన్నం సరఫరా చేయడం మంచిదే. క్యాంటీన్‌కు వచ్చిన వారు భోజనం లభించక వెనుదిరిగి పోయే పరిస్థితి వద్దు. నిర్వహణలో పారదర్శకత పాటించడం ద్వారా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాలి. ఎన్టీఆర్ పేరు చెడగొట్టవద్దు. – కొండూరు జనార్దన్‌రాజు, కడప నిర్ణీత సమయమంతా భోజనం పెట్టాలి ఉదయం టిఫెన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశిత వేళలను ప్రకటించింది. ఆ సమయాల్లో ఎంతమంది వచ్చినా భోజనం పెట్టాలి. అలాకాకుండా మేం ఇంతమందికి మాత్రమే పెడతామనడం సరైంది కాదు. ప్రతిరోజు చాలామంది భోజనం లభించక వెనుకదిరిగిపోతున్నారు. – ఎన్.వెంకట శివ, సీపీఐ నగర కార్యదర్శి, కడప -
అన్నప్రసాదం అడిగితే అవమానించారు !
మహానంది: దేవుడి సన్నిధిలో నిర్వహిస్తున్న అన్నప్రసాదం తీసుకుంటే పుణ్యం వస్తుందనే భావనతో ప్రసాదంగా కొంచెం అన్నం పెట్టండని అడిగిన భక్తులను అవమానించిన ఘటన మహానంది క్షేత్రంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ ఓల్డ్‌సిటీకి చెందిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులు మహానందీశ్వరుడి దర్శనార్థం మహానందికి వచ్చారు. స్వామి దర్శనం అనంతరం అన్నదాన కేంద్రం వైపు వెళ్లా రు. ప్రసాదంలా ఓ ముద్ద అడిగేందుకు లోపలికి వెళ్తుండగా అక్కడి సిబ్బంది అడ్డుకుంటూ టోకెన్లు లేనివారిని అనుమతించమని, దురుసుగా ప్రవర్తిస్తూ మహిళలని సైతం చూడకుండా తోసేశారు. ప్రసాదంలా ఓ ముద్ద పెడితే చాలని బతిమాలినా వారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అవమానంగా భావించిన భక్తులు కంటతడిపెట్టి వెళ్లారు. ఈ విషయాన్ని ప్రత్యక్షంగా చూసిన డ్వామా ఏపీడీ రాజారావు వెంటనే ఈఓ సుబ్రహ్మణ్యంకు ఫోన్లో విషయం తెలపడంతో పాటు నేరుగా కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం ఈఓ సంబంధిత సిబ్బందిని పిలిపించి మందలించారు. -
ఓటుకు 10 వేలు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని ఆర్కేనగర్ ఉపఎన్నికకు ముందు రోజు ఓటుకు రూ. 10 వేలు ఇస్తామని దినకరన్ అనుచరులు తమకు టోకెన్లు ఇచ్చారని పలువురు ఓటర్లు ఆరోపించారు. ఈ టోకెన్ల కోసం జరిగిన గొడవల్లో మంగళవారం పోలీసులు నలుగురు దినకరన్ అనుచరుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్‌కు రెండు రోజులకు ముందు కోయంబేడు కూరగాయల మార్కెట్‌కు రూ.180 కోట్లు వచ్చాయని వ్యాపారస్తులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన దినకరన్ అనుచరులు రూ.10 వేలకు బదులు రూ.20 నోటిచ్చి దానిపై ఉన్న కోడ్ రాసుకున్నారని, ఫలితాలనంతరం ఆ నోటు చూపితే డబ్బిస్తామని హామీ ఇచ్చారని ఓటర్లు వెల్లడించారు. రూ.20 నోట్లు పంచిన వారంతా ఆర్కేనగర్కు చెందిన వ్యక్తులే కావడంతో వ్యవహారం సజావుగా సాగింది. ఇప్పుడు ఫలితం తేలడంతో టోకెన్ ఇచ్చిన వాళ్లను ఓటర్లు నిలదీస్తున్నారు. కొందరు ఫోన్ స్విచాఫ్ చేయడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో టోకెన్ అందని కొందరికి సోమవారం వాటిని ఇస్తుండగా.. ఘర్షణ చోటు చేసుకుంది. దినకరన్ అనుచరులు కార్తికేయన్ అనే వ్యక్తిపై దాడిచేశారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు దినకరన్ అనుచరులను అరెస్టు చేశారు. -
అన్నదాత ఆక్రోశం
- విత్తన టోకన్ల నిలిపివేతపై కనెర్ర – ప్రధాన రహదారిలో గంటపాటు నిరసన – రైతులకు మద్దతు పలికిన ïసీపీఐ, సీపీఎం నాయకులు పత్తికొండ: సబ్సిడీ వేరుశనగ విత్తనాల కోసం అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. శనివారం స్థానికి వ్వవసాయ మార్కెట్ యార్డు అవరణలో విత్తన టోకన్లు పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించడంతో ఉదయం ఏడు గంటలకే రైతులు పత్తికొండకు చేరుకున్నారు. మ«ధ్యాహ్నం 12.30 గంటలైన కౌంటర్ల వద్దకు వ్యవసాయ అధికారులు రాక పోవడంతో వారు ఆగ్రహించారు. మార్కెట్ యార్డు వద్ద ప్రదాన రహదారిలో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సీపీఐ నియోజకవర్గ కన్వీనర్ నబీరసూల్, మండల నాయకులు కారన్న, సీపీఎం డివిజన్ కన్వీనర్ వీరశేఖర్, సీఐటీయూ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు చక్రాళ్ల వెంకటేశ్వరరెడ్డి, దస్తగిరి రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. వెంటనే విత్తన టోకన్లు ఇవ్వాలని, డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ వస్తున్నారని టోకన్లు ఇవ్వడం నిలిపేయడం దారుణమని మండిపడ్డారు. సమాచారం తెలుసుకున్న పత్తికొండ, తుగ్గలి ఎస్ఐలు, పోలీసులు మార్కెట్‌యార్డుకు చేరుకొని రైతులను నచ్చజెప్పేందుకు యత్నించారు. సబ్సిడీ విత్తనాలకు టోకన్ల ఇస్తామని అధికారులు చెప్పడంతోనే తాము రామలింగాయపల్లి, చెన్నంపల్లి, ఎర్రగుడి, గిరిజన తండాల నుంచి చార్జీలు పెట్టుకొని వచ్చామని వాపోయారు. పత్తికొండలో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పర్యటన ముగిసిన వెంటనే టోకన్లను ఇప్పిస్తామని పత్తికొండ ఎస్ఐ మధుసూదన్ హమీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. -
ఆంధ్రాబ్యాంకులో కస్టమర్లకు టోకెన్లు
-
తిరుమలలో లడ్డూ టోకెన్ల కలర్ జిరాక్స్ కలకలం
-
నడకదారి భక్తుల దర్శన టోకెన్లు నిలిపివేత
తిరుమల : తిరుమలలో నడకదారి భక్తులకు ఇకపై శుక్ర, శని, ఆదివారాల్లో దర్శన టోకెన్లను టీటీడీ నిలిపి వేయనుంది. శుక్రవారం అర్థరాత్రి నుంచి ఆదివారం అర్థరాత్రి వరకు కాలిబాట భక్తులకు టోకెన్లను కేటాయించమని జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. దీనిపై నడక దారి భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.