అన్నదాత ఆక్రోశం
అన్నదాత ఆక్రోశం
Published Sat, Jun 3 2017 10:04 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
- విత్తన టోకన్ల నిలిపివేతపై కనెర్ర
– ప్రధాన రహదారిలో గంటపాటు నిరసన
– రైతులకు మద్దతు పలికిన ïసీపీఐ, సీపీఎం నాయకులు
పత్తికొండ: సబ్సిడీ వేరుశనగ విత్తనాల కోసం అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. శనివారం స్థానికి వ్వవసాయ మార్కెట్ యార్డు అవరణలో విత్తన టోకన్లు పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించడంతో ఉదయం ఏడు గంటలకే రైతులు పత్తికొండకు చేరుకున్నారు. మ«ధ్యాహ్నం 12.30 గంటలైన కౌంటర్ల వద్దకు వ్యవసాయ అధికారులు రాక పోవడంతో వారు ఆగ్రహించారు. మార్కెట్ యార్డు వద్ద ప్రదాన రహదారిలో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సీపీఐ నియోజకవర్గ కన్వీనర్ నబీరసూల్, మండల నాయకులు కారన్న, సీపీఎం డివిజన్ కన్వీనర్ వీరశేఖర్, సీఐటీయూ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు చక్రాళ్ల వెంకటేశ్వరరెడ్డి, దస్తగిరి రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు.
వెంటనే విత్తన టోకన్లు ఇవ్వాలని, డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ వస్తున్నారని టోకన్లు ఇవ్వడం నిలిపేయడం దారుణమని మండిపడ్డారు. సమాచారం తెలుసుకున్న పత్తికొండ, తుగ్గలి ఎస్‌ఐలు, పోలీసులు మార్కెట్‌యార్డుకు చేరుకొని రైతులను నచ్చజెప్పేందుకు యత్నించారు. సబ్సిడీ విత్తనాలకు టోకన్ల ఇస్తామని అధికారులు చెప్పడంతోనే తాము రామలింగాయపల్లి, చెన్నంపల్లి, ఎర్రగుడి, గిరిజన తండాల నుంచి చార్జీలు పెట్టుకొని వచ్చామని వాపోయారు. పత్తికొండలో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పర్యటన ముగిసిన వెంటనే టోకన్లను ఇప్పిస్తామని పత్తికొండ ఎస్‌ఐ మధుసూదన్ హమీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు.
Advertisement