నేరుగా అమ్మ దర్శనానికే..! | Online And Computer Tokens Policy Canceled For Vijayawada Durgamma Darshan | Sakshi
Sakshi News home page

నేరుగా అమ్మ దర్శనానికే..!

Published Sat, Apr 10 2021 10:28 AM | Last Updated on Sat, Apr 10 2021 10:28 AM

Online And Computer Tokens Policy Canceled For Vijayawada Durgamma Darshan - Sakshi

చైర్మన్‌ పైలా సోమినాయుడితో సమావేశమైన ఈవో భ్రమరాంబ  

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): అమ్మవారి దర్శనానికి ఆన్‌లైన్, కంప్యూటర్‌ టోకెన్ల విధానాన్ని దుర్గగుడి ఈవో భ్రమరాంబ శుక్రవారం రద్దు చేశారు. దుర్గగుడి ఈవోగా బాధ్యతలు చేపట్టిన భ్రమరాంబ గురువారం రాత్రి భక్తులకు టికెట్లు జారీ చేస్తున్న టోకెన్ల విధానాన్ని పరిశీలించారు. ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులు ఉచిత దర్శనం కోసం నేరుగా క్యూలైన్‌లోకి ప్రవేశించి అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రూ.300, రూ.100 టికెట్లను క్యూలైన్ల వద్దే జారీ చేసే ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. శుక్రవారం మధ్యాహ్నం దేవస్థాన ఆవరణలో దుర్గగుడి చైర్మన్‌ పైలా సోమినాయుడుని ఈవో భ్రమరాంబ మర్యాద పూర్వకంగా కలిసి ఉగాది, చైత్రమాస బ్రహ్మోత్సవాల వేడుకల నిర్వహణ, అభివృద్ధి పనుల గురించి చర్చించారు.
చదవండి:
ఆంధ్రజ్యోతి ప్రెస్‌కు ఐలా నోటీసులు 
చంద్రబాబు, నారా లోకేశ్‌పై డీజీపీకి ఫిర్యాదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement