తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 21 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . నిన్న 76,665 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 31,377 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.58 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 8 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
తిరుమల వెళ్లనున్న చంద్రబాబు
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బుధవారం సాయంత్రం చంద్రబాబు తిరుమల వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బస చేసి గురువారం ఉదయం కుటుంబ సమేతంగా వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం అదే రోజు తిరిగి విజయవాడ చేరుకుంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment