తిరుమల వీఐపీ దర్శనాల్లో మార్పులు
తిరుమల వీఐపీ దర్శనాల్లో మార్పులు
Published Mon, Mar 27 2017 3:54 PM | Last Updated on Mon, Jul 29 2019 6:07 PM
తిరుమల: వీఐపీ బ్రేక్ దర్శనాల్లో మార్పులు చేస్తూ టీటీడీ పాలక మండలి నిర్లయించింది. వీఐపీ దర్శనాల్లో మూడో కేటగిరిని తొలిగించామని, ఇక మెదటి రెండు కేటగిరిలు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఆలయ ఈవో డి.సాంబశివరావు సోమవారం మీడియాకు తెలిపారు. ఈ నిబంధన ఏప్రిల్ 7 నుంచి 10 వారాలపాటు అందుబాటులో ఉంటుందని చెప్పారు.
శుక్ర, శని వారల్లో వీఐపీ దర్శనాలు, సిఫారసు లేఖలు రద్దు చేశామని పేర్కొన్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనంలో రద్దీని బట్టి మార్పులు చేస్తామని తెలిపారు. వకులమాత అతిథి భవన నిర్మాణానికి రూ.39 కోట్లు కేటాంయించామని, రాయచోటి, అప్పలాయగుంటలో రూ.4.5 కోట్లతో కళ్యాణ మండపాలు నిర్మించనున్నట్లు ఈవో తెలిపారు.
Advertisement