
సాక్షి, తిరుమల: నూతన దంపతులు నిహారిక కొణెదల, చైతన్య జొన్నలగడ్డ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి వారు శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకస్వామి మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
కాగా, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక, గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యల వివాహ వేడుకను డిసెంబర్ 9న జైపూర్‌లోని ఉదయ్ విలాస్ ప్యాలెస్‌లో ఘనంగా నిర్వహించారు. అనంతరం డిసెంబర్ 11 (శుక్రవారం)న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో మెగా కుటుంబ సభ్యులతో పాటు.. పలువురు సినీ ప్రముఖలు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
చదవండి: (ఘనంగా నిహారిక-చైతన్య రిసెప్షన్)
Comments
Please login to add a commentAdd a comment