venkateswaraswamy temple
-
శ్రీవారిని దర్శించుకున్న నిహారిక దంపతులు
సాక్షి, తిరుమల: నూతన దంపతులు నిహారిక కొణెదల, చైతన్య జొన్నలగడ్డ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి వారు శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకస్వామి మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాగా, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక, గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యల వివాహ వేడుకను డిసెంబర్ 9న జైపూర్‌లోని ఉదయ్ విలాస్ ప్యాలెస్‌లో ఘనంగా నిర్వహించారు. అనంతరం డిసెంబర్ 11 (శుక్రవారం)న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో మెగా కుటుంబ సభ్యులతో పాటు.. పలువురు సినీ ప్రముఖలు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: (ఘనంగా నిహారిక-చైతన్య రిసెప్షన్) -
చోరికి ప్రయత్నించి.. అర్చకులకు అడ్డంగా దొరికి..
సాక్షి, విజయవాడ: ఆలయంలో చోరికి యత్నించిన దుండగుడు అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకెళ్తే.. గన్నవరంలోని శ్రీవెంకటేశ్వరంస్వామి ఆలయంలోకి ప్రవేశించిన దుండగుడు హుండీ పగలగొడుతుండగా అర్చకులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని గుడి స్తంభానికి కట్టేసిన అర్చకులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కాగా, చోరీకి పాల్పడిన వ్యక్తి ఉంగటూరు మండలం తేలప్రోలుకు చెందిన నరేంద్రగా గుర్తించారు. చదవండి: ('నన్ను వెతకకండి.. నేను చనిపోతున్నా..’) -
మొక్కులు చెల్లించుకున్న రఘునందన్‌రావు
సాక్షి, తిరుమల: దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్రావు బుధవారం తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం ఆయన తిరుమల విచ్చేసి, స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. అనంతరం వెంకన్న దర్శనం చేసుకున్నారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగిన యువకుల సహకారంతో దుబ్బాక ఎన్నికలో విజయం సాధించాను. విద్య నేర్పిన గురువుతోనే పోటీపడితే బాగుంటుంది. నేను గురువుగా భావించిన కేసీఆర్ నుండి ఆశీస్సులు లభిస్తాయని భావిస్తున్నా. దుబ్బాకలో బీజేపీ విజయం దక్షణాది రాష్ట్రాలపై ప్రభావం చూపుతుంది. పార్టీ సమిష్ట కృషికి నిదర్శనం నా గెలుపు. పార్టీకి అన్ని విధాల సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నా. ప్రజాసేవ చేయాలనే తపనే ముఖ్యమంత్రి గడ్డపై నన్ను గెలిపించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే దుబ్బాక నియోజక వర్గాన్ని అగ్రగామిగా నిలిపేందుకు శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించాను అని ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. కాగా రఘునందర్రావు దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని సోలిపేట సుజాతపై గెలుపొందిన విషయం తెలిసిందే. చదవండి: (టీఆర్ఎస్ కంచుకోటలో కమలదళం పాగా) (దుబ్బాక ఫలితంపై టీఆర్ఎస్లో అంతర్మథనం) -
తిరుమల: ఆస్థానం కారణంగా ఆర్జిత సేవలు రద్దు
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా నవంబరు 14వ తేదీన 'దీపావళి ఆస్థానాన్ని' టీటీడీ శాస్రోక్తంగా నిర్వహించనుంది. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య(దీపావళి) నాడు యథాప్రకారంగా శ్రీవేంకటేశ్వరస్వామివారికి సుప్రభాతం మొదలుకొని మొదటి గంట నివేదన వరకు కైంకర్యాలు జరుగుతాయి. అనంతరం ఉదయం 7 నుండి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది. (శ్రీవారిని దర్శించుకున్న స్వరూపానందేంద్రస్వామి) ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది. కాగా సాయంత్రం 5.00 నుండి 7.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. దీపావళి ఆస్థానం కారణంగా నవంబరు 14న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. -
17 నుంచి పారిజాతగిరిలో బ్రహ్మోత్సవాలు
జంగారెడ్డిగూడెం : గోకుల పారిజాత గిరి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 17 నుంచి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మ న్ బిక్కిన సత్యనారాయణ, ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 17న సాయంత్రం 6 గంటలకు విశ్వక్సేన పూజ, అంకురారోహణ, వైనతేయ ప్రతిష్ట కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 18న పుణ్యాహవచనం, ధ్వజారోహణము, అగ్ని ప్రతిష్ట, కుంభస్థాపన, నిత్యహోమం, సాయంత్రం 8 గంటలకు శేషవాహన సేవ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 19 న నిత్యహోమంతో పాటు నీరాజనం, తీర్థ ప్రసాదగోష్టి జరుగుతాయని తెలిపారు. రాత్రి 8 గంటలకు హనుమదుత్సవం చేపడుతున్నట్టు తెలిపారు. 20న శనివారం ఉదయం 10 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి వారి కల్యాణం, రాత్రికి చంద్రప్రభ వాహన సేవ ఉంటుందన్నారు. 21వ తేదీ ఆదివారం సాయంత్రం కోలాటం, భజన, విచిత్ర వేషధారణలతో గరుడ వాహన సేవ (గ్రామోత్సవం) నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే 22 సోమవారం వసంతోత్సవం, చక్రస్నానం, మహా పూర్ణాహుతి, రాత్రికి గజవాహన సేవ, ధ్వజారోహణం తదితర కార్యక్రమాలు రుత్విక్కుల ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. 23 మంగళవారం ఉదయం ధృవమూర్తికి పంచామృతాభిషేకం, నవకలశ స్నపనము, రాత్రి ద్వాదశారాధ న, ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాగా 17న ఉదయం 11 గంటలకు 108 మంది దంపతులతో సామూహిక కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ధర్మకర్తలు పొన్నాడ సత్యనారాయన, గుళ్లపూడి శ్రీదేవి, యిళ్ల రామ్మోహనరావు, మారిశెట్టి బాలకృష్ణ, తోట రామకృష్ణ, బోడ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.