మొక్కులు చెల్లించుకున్న రఘునందన్‌రావు | Dubbaka MLA Raghunandan Rao Visits Tirumala | Sakshi
Sakshi News home page

కేసీఆర్ నుండి ఆశీస్సులు లభిస్తాయని భావిస్తున్నా..!

Published Wed, Nov 11 2020 12:32 PM | Last Updated on Wed, Nov 11 2020 5:47 PM

Dubbaka MLA Raghunandan Rao Visits Tirumala - Sakshi

సాక్షి, తిరుమల: దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్‌రావు బుధవారం తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం ఆయన తిరుమల విచ్చేసి, స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. అనంతరం వెంకన్న దర్శనం చేసుకున్నారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగిన యువకుల సహకారంతో దుబ్బాక ఎన్నికలో విజయం సాధించాను. విద్య నేర్పిన గురువుతోనే పోటీపడితే బాగుంటుంది. నేను గురువుగా భావించిన కేసీఆర్ నుండి ఆశీస్సులు లభిస్తాయని భావిస్తున్నా.

దుబ్బాకలో బీజేపీ విజయం దక్షణాది రాష్ట్రాలపై ప్రభావం చూపుతుంది. పార్టీ సమిష్ట కృషికి నిదర్శనం నా గెలుపు. పార్టీకి అన్ని విధాల సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నా. ప్రజాసేవ చేయాలనే తపనే ముఖ్యమంత్రి గడ్డపై నన్ను గెలిపించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే దుబ్బాక నియోజక వర్గాన్ని అగ్రగామిగా నిలిపేందుకు శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించాను అని ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. కాగా రఘునందర్‌రావు దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని సోలిపేట సుజాతపై గెలుపొందిన విషయం తెలిసిందే.

చదవండి: (టీఆర్‌ఎస్‌ కంచుకోటలో కమలదళం పాగా)

(దుబ్బాక ఫలితంపై టీఆర్‌ఎస్‌లో అంతర్మథనం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement