
సాక్షి, విజయవాడ: ఆలయంలో చోరికి యత్నించిన దుండగుడు అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకెళ్తే.. గన్నవరంలోని శ్రీవెంకటేశ్వరంస్వామి ఆలయంలోకి ప్రవేశించిన దుండగుడు హుండీ పగలగొడుతుండగా అర్చకులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని గుడి స్తంభానికి కట్టేసిన అర్చకులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కాగా, చోరీకి పాల్పడిన వ్యక్తి ఉంగటూరు మండలం తేలప్రోలుకు చెందిన నరేంద్రగా గుర్తించారు. చదవండి: ('నన్ను వెతకకండి.. నేను చనిపోతున్నా..’)
Comments
Please login to add a commentAdd a comment