తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. స్వామి వారి దర్శనం కోసం శుక్రవారం 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 9 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 9 గంటల సమయం పడుతోంది. రద్దీ కారణంగా ఈ రోజు నుంచి 4 వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
వారం రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం గాంధీ జయంతి, పెరటాశి నెలలో మూడో శనివారం, ఆదివారం సెలవు కారణంగా రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు సిఫారసు లేఖలకు ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేశారు. ఇక ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వీఐపీలకు మాత్రమే తక్కువ సంఖ్యలో టికెట్లు కేటాయిస్తారు.