
తిరుపతిలో పాక్షికంగా చంద్రగ్రహణం
తిరుపతి నగరంలో చంద్రగ్రహణం దృశ్యాలు సాయంత్రం 7.10 నుంచి 7.40 గంటల మధ్య దర్శనమిచ్చాయి.
తిరుపతి కల్చరల్: తిరుపతి నగరంలో చంద్రగ్రహణం దృశ్యాలు సాయంత్రం 7.10 నుంచి 7.40 గంటల మధ్య దర్శనమిచ్చాయి. చంద్రగ్రహణం సందర్భంగా నగరంలో గర్భిణులు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ఇంటికే పరిమితమయ్యారు.
గ్రహణం వీడిన అనంతరం గర్భిణులతో పాటు ప్రజలందరూ తమ గృహాలను శుభ్రం చేసుకుని దీపారాధనలు చేసి పూజలు చేశారు. కొందరు పేదలకు వస్త్రాలు, ధాన్యం, బెల్లం ప్రసాదాలు వండి వితరణ చేశారు.