
తిరుపతిలో ఆలయాల మూత
తిరుపతి కల్చరల్: చంద్రగ్రహణం సందర్భంగా టీటీడీ స్థానిక ఆలయాలు శనివారం ఉదయం 9.30 నుంచి మూతపడ్డాయి. తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయం, శ్రీకోదండరామస్వామి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉదయం 9.30 నుంచి రాత్రి 8 గంటల వరకు మూసివేశారు.
దీంతో ఆలయాల ప్రాంతాలు నిర్మానుషంగా మారాయి. తిరిగి రాత్రి 8 గంటల వరకు ఆలయాలను తెరిచి శుద్ధి చేసి పుణ్యహవచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయంలో రాత్రి 10 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించారు. కాగా గోవిందరాజస్వామి వారు రాత్రి 10 నుంచి 11 గంటల నడుమ విశేషమైన గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన మిచ్చారు.