తిరుమల: ఈ నెల 4న చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. శనివారం ఉదయం 9గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది.
చంద్రగ్రహణం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 6గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటలకు దివ్యదర్శనం రద్దు చేయనున్నట్టు తెలిపింది. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నిలిపివేయనున్నట్టు టీటీడీ తెలిపింది.
4న చంద్రగ్రహణం.. తిరుమల ఆలయం మూసివేత
Published Thu, Apr 2 2015 5:27 PM | Last Updated on Tue, Aug 28 2018 5:55 PM
Advertisement
Advertisement