వెబ్‌డెస్క్, హైదరాబాద్ : సుమారు 36 ఏళ్ల తర్వాత ఆకాశంలో చంద్రుని సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. సూపర్ మూన్, బ్లూ మూన్, సంపూర్ణ చంద్ర గ్రహణం మూడు కలసి ఒకేసారి కనిపించి ప్రపంచంలోని పలు దేశాల ప్రజలను కనువిందు చేశాయి. సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా భూమి పూర్తిగా నీడలోనే ఉండిపోవడంతో జాబిల్లి ముదురు ఎరుపురంగులో(బ్లడ్ మూన్‌గా) కనిపించింది.
సాయంత్రం 04.21 గంటలకు ప్రారంభమైన గ్రహణం రాత్రి దాదాపు ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ముగిసింది. ఆసియా, తూర్పు రష్యా, మధ్య ప్రాచ్యప్రాంతం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఈ ఖగోళ వింత చోటు చేసుకుంది.
భారత్ వ్యాప్తంగా...
దేశ వ్యాప్తంగా సంపూర్ణ చంద్ర గ్రహణం దర్శనమిచ్చింది. చందమామ(సెలీన్)పై పాక్షిక నీడ లేదా భూమికి చెందిన పెన్యుంబ్రా నీడతో బుధవారం సాయంత్రం 5.20కి మన దేశంలో కనిపించడం ప్రారంభమైంది. ప్రధాన గ్రహణం మాత్రం సూర్యాస్తమయం తర్వాత 6.25 నిమిషాలకు ప్రారంభమై, తూర్పు వైపు ఆకాశంలో కనిపించింది. ఈ నెల 1వ తేదీన తొలి పౌర్ణమి ఏర్పడింది. తిరిగి 28 రోజుల్లోనే మళ్లీ పౌర్ణమి రావటంతో దీన్ని బ్లూ మూన్‌గా పిలుస్తున్నారు.
సూపర్ మూన్...
చంద్రుడు గుండ్రంగా ఒక స్థిర కక్ష్యలో కాకుండా కొంచెం అటూ ఇటూగా (అప్సిడల్ ప్రిసిషన్)లో భ్రమిస్తుండటంతో కొన్ని పర్యాయాలు భూమికి కొంత సమీపంగా వస్తాడు. ఇలాంటి సందర్భాల్లో.. పున్నమి రోజుల్లో సూర్యుడికి ఎదురుగా వస్తాడు. ఈ కారణంగా చంద్రుడి పరిమాణం పెరిగినట్లుగా అనిపిస్తుంది. చంద్రుడు ఇలా పెద్దగా కనిపించడాన్ని సూపర్ మూన్‌గా అభివర్ణిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment